Advertisement
Google Ads BL

కాంతార ఓటిటి రిలీజ్: నిరాశలో ఆడియన్స్


ఫైనల్లీ ప్రేక్షకులకి సర్ ప్రైజ్ ఇస్తూ అమెజాన్ ప్రైమ్ వారు కాంతార ని గత అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ కి తీసుకువచ్చారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార ని ఎప్పుడెప్పుడు ఓటిటి లో చూద్దామా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 16 కోట్ల తో తెరకెక్కిన కన్నడ కాంతార ప్రతి భాషలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 400 కోట్ల మార్క్ తో రికార్డులు సృష్టించింది. దానితో కాంతార ఓటిటి రిలీజ్ పై ప్రేక్షకులు బాగా వెయిట్ చేసారు. తీరా ఓటిటిలో కాంతార రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు మండి పడుతున్నారు. కాంతారా లో బ్యాక్ బోన్ గా నిలిచిన వరాహా రూపం సాంగ్ థియేటర్స్ లో ఆడియన్స్ ని ఉర్రుతలూగించింది. ఆ సాంగ్ తర్వాత కాంట్రవర్సీ అయ్యింది కూడా.

Advertisement
CJ Advs

కాంతార బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ ఎంతలా ప్రేక్షకుల్లోకి వెళ్లింది అంటే.. ఎక్కడ చూసినా ఆ వరాహం పాటే, ఆ సాంగ్ చూసెయ్యాలి, సినిమాలో అంతలా హిట్ అయిన ఆ సాంగ్ ఓటిటిలో చూసేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు కాంతార ఓటిటిలో రిలీజ్ అయ్యాక మేకర్స్ ఆడియన్స్ కి షాకిచ్చారు.  కాంతార థియేటర్స్ లో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్, వరాహా రూపం సాంగ్, ఆ అరుపులు ఓటీటీ రిలీజ్ కాంతారా లో కనిపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు.

వరాహా రూపం సాంగ్ లేపేసి కాంతారని ఓటిటిలో రిలీజ్ చేయడంపై ఆడియన్స్ మండిపడుతున్నారు. అయితే వరాహా రూపం పాటపై కాపీ రైట్ యాక్ట్ రావడంతోనే ఈ పాటను మేకర్స్ తొలిగించినట్లుగా తెలుస్తోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన కాంతార ఓటీటీలోకి రాగానే ఆడియన్స్ నుండి వ్యతిరేఖత మొదలయ్యింది. 

Soul Of Kantara Is Missing on OTT:

Audience Disappointed With Kantara OTT Version
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs