సమంత ప్రస్తుతం యశోద సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు, ఆమె మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాటం చేస్తుంది. మాయోసైటిస్ తో సమంత ఎంతగా బాధని అనుభవించిందో ఆమె సోషల్ మీడియా పోస్ట్ చూస్తే తెలుస్తుంది. అయితే సమంత మాయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంది, ఆమె ప్రాణాలకి ప్రమాదం అంటూ చాలామంది ఆమెని బాధపెట్టారు. మాయోసైటిస్ వలన ప్రాణ భయం లేకపోయినా.. మానసికంగా కుంగుబాటు, నీరసం లాంటివి హెవీ గా ఉంటాయి.
అయితే సమంత మాయోసైటిస్ తో ఆసుపత్రిలో చేరింది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. సమంత మాయోసైటిస్ తో అస్వస్థతకి గురవడం వలన హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటూ కోలీవుడ్ లో ప్రచారం మొదలయ్యింది. కానీ సమంత ఆసుపత్రిలో జాయిన్ అవ్వలేదని, ఆమె మాయోసైటిస్ నుండి కోలుకుంటుంది, ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉంది అంటూ ఆమె ఫ్యామిలీ మెంబెర్స్ చెబుతున్నారు.
మరోపక్క సమంత మేనేజర్ కూడా సమంత ఎలాంటి అస్వస్థతకి గురి కాలేదు, ఆమె కోలుకుంటుంది, ఆసుపత్రిలో చేరింది అని వస్తున్న వార్తలన్నీ గాసిప్స్, ఎవరూ ఆ వదంతులు నమ్మొద్దు అంటూ చెబుతున్నాడు.