బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్ ఎపిసోడ్ నడుస్తుంది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎమోషన్స్ పండిస్తున్నారు. ఇప్పటికే ఆది రెడ్డి వైఫ్ ఆయన కూతురు రాగా.. ఆ పాప బర్త్ డే హౌస్ లో చేసారు. తర్వాత రాజ్ తల్లి వచ్చారు. ఆ తర్వాత ఫైమా తల్లి వచ్చింది. ఆమె సత్యని నమ్మొద్దు అంటూ ఫైమా తో చెప్పింది. ఫైమా-ఆమె తల్లి బాండింగ్ చూసి కీర్తి కి ఫ్యామిలీ మెంబెర్స్ గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత రేవంత్ కూడా డల్ గానే కనిపించాడు.
శ్రీ సత్య తల్లి-తండ్రి ఇద్దరూ వచ్చారు. ముందునుండి ప్రచారం జరిగినట్టుగానే శ్రీ సత్య ఎపిసోడ్ అందరిని కంటతడి పెట్టించింది. ఆమె తల్లి వీల్ చైర్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి రాగా.. ఆమె తండ్రి నువ్వు తుప్పాసి నామినేషన్స్ వేస్తున్నావ్ అంటూ వార్న్ చేసాడు. ఇక ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం చాలామంది హౌస్ మేట్స్ వెయిట్ చేసారు. అందులో గలాటా గీతూ ఒకరు. ఆమె బిగ్ బాస్ ని రూల్ చేద్దామని, బిగ్ బాస్ కప్ గెలుస్తానని కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ కే గేమ్ ఆడడం నేర్పిస్తా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి ఇంట్లో కూర్చుంది. అప్పటినుండి మీడియా కి ముఖం చూపించకుండా ఏడుస్తూనే ఉంది.
అయితే తాను బిగ్ బాస్ ఫైనల్స్ వరకు ఉంటానని.. ఆమె ఫ్యామిలీ ఎపిసోడ్ లో తల్లికి ఓ చీర కొని ఇచ్చిందట. ఆ చీర కట్టుకుని బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ కి రమ్మని. కానీ మధ్యలోనే ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న గీతూ వీడియో ని ఫ్యామిలీ మెంబెర్స్ షేర్ చేసారు. ఆ వీడియోలో గీతూ ఏడుస్తూనే కనిపించింది.