Advertisement
Google Ads BL

హీరో కమల్ హాసన్‌కు అస్వస్థత


యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. తీవ్రంగా జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకునేందుకు కూడా బాగా ఇబ్బంది పడుతుండటంతో.. వెంటనే ఆయనని హాస్పిటల్‌కి తరలించినట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్‌లో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్‌ హెల్త్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

Advertisement
CJ Advs

 

ఇంతకుముందు ఆయన రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇప్పుడు సడెన్‌గా ఆయనకు ఈ పరిస్థితి ఏమిటనేది తెలియాలి. బుధవారం హైదరాబాద్‌లోని దర్శకుడు కె. విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లిన కమల్‌హాసన్‌.. ఆయనతో కొంత సమయం గడిపి.. ఆత్మీయంగా ముచ్చటించినట్లుగా తెలుపుతూ.. విశ్వనాథ్‌ చేతిని కళ్లకు అద్దుకుంటున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పుడు ఆయన హెల్దీగానే కనిపించారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే ఆయన ఇలా హాస్పిటల్ పాలు కావడంతో.. కమల్ హాసన్‌కు ఏమై ఉంటుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Kamal Haasan Hospitalised:

Kamal Admitted To Porur Ramachandra Hospital At Chennai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs