Advertisement
Google Ads BL

బోటే ఎక్కు.. డీజే నొక్కు.. పగిలిందీ పార్టీ!


‘నా బోటే ఎక్కు.. డీజే నొక్కు.. బొంభాట్ పార్టీ

Advertisement
CJ Advs

నా బోటే ఎక్కు.. డీజే నొక్కు.. పగులుద్దీ పార్టీ’’.. నిజంగానే బాస్ పార్టీ పగిలిపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’. 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి.. చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. చిరంజీవి అంటే డ్యాన్స్.. డ్యాన్స్ అంటే చిరంజీవి.. అది మరోసారి ఈ సాంగ్ నిరూపిస్తుంది. బాస్ పార్టీ అదిరిపోయింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. ఈ పాటలో చిరుతో జతకట్టింది. చిరు మాసివ్ స్టెప్స్‌తో.. మాస్‌కు పూనకాలు తెప్పించేలా.. ఈ బాస్ పార్టీ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవడం ఖాయం. రాబోయే నూతన సంవత్సరానికి వెల్‌కల్ చెప్పేలా.. దేవిశ్రీ ఈ పాటని కంపోజ్ చేశారు.

 

మెగాస్టార్ చిరంజీవి అంటే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌కు ఎంత ఇష్టమో.. ఈ పాటతో మరోసారి నిరూపించుకున్నారు. ఈ పాటను ఆయన కంపోజ్ చేయడమే కాకుండా.. ఆయనే రాసి, పాడారు. బాస్ పార్టీ  డీఎస్పీ స్టయిల్‌లో మాస్ మసాలా నంబర్‌గా ఉంది. నకాష్ అజీజ్, హరిప్రియ డైనమిక్‌గా పాడిన ఈ పాటకు దేవిశ్రీ ర్యాప్ డబల్ ఎనర్జీ జోడిస్తుంది. చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్, మాస్ అప్పీలింగ్ డ్యాన్సులు అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. దేవిశ్రీ పాట, చిరు ఆట.. ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా, చూడాలనిపించేలా చేస్తోంది. అలాగే చిరు చెప్పినట్లుగా.. ఈ పాటకి ఏఎస్ ప్రకాశ్ వేసిన సెట్, శేఖర్ మాస్టర్ తన స్పెషల్ అయిన హుక్ స్టెప్స్‌తో ఈ సాంగ్‌కు చేసిన కొరియోగ్రఫీ హైలెట్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ అన్ని ఫార్మెట్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు.

Boss Party with Chiru mass mania:

Waltair Veerayya: Megastar mass moves in Boss Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs