Advertisement
Google Ads BL

‘కస్టడీ’లో నాగచైతన్య.. ఏం జరిగింది?


‘కస్టడీ’లో నాగచైతన్య ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆయన ఏం నేరం చేశాడని కస్టడీకి తీసుకున్నారనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగచైతన్య హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న నాగచైతన్య 22వ చిత్రానికి ‘కస్టడీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చైతూ పుట్టినరోజును పురస్కరించుకుని.. చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన ‘బంగార్రాజు’ బ్యూటీ కృతిశెట్టి మరోసారి జతకడుతోంది. 

Advertisement
CJ Advs

 

ఇక ఈ ఫస్ట్ లుక్‌లో నాగచైతన్యను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఫెరిషియస్ అవతార్‌లో చైతూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ శివ పాత్రలో.. అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడనేది ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన సొంత వ్యవస్థతోనే పోరాటం చేస్తాడనేది ఈ ఫస్ట్ లుక్‌తోనే స్పష్టమయ్యేలా చేశారు మేకర్స్. నాగచైతన్య ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడనేది కూడా ఈ పోస్టర్‌తో తెలిసిపోతుంది. వెంకట్ ప్రభు విషయానికి వస్తే.. ప్రతి చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్ ఇవ్వడంలో ఆయన దిట్ట. ఈ సినిమాకి ‘ఎ వెంకట్ ప్రభు హంట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టిన ఆయన.. ‘మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి’ అని ట్వీట్ చేశారు. సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

NC22: Raging First Look Of Custody:

Naga Chaitanya and Venkat Prabhu film Custody 1st Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs