Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఈ ట్రీట్ సరిపోతుందా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ చిత్రం రోజురోజుకూ ఆలస్యమవుతూ వస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ షూటింగ్స్ చేసుకుంటూ బిజీబిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఖాళీగానే ఉండటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతూ వస్తున్నారు. అయితే ‘ఎన్టీఆర్ 30’ చిత్రం ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటిని జయించి.. ఇప్పుడిప్పుడే కాస్త ఈ మూవీ మేకర్స్‌లో మూమెంట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి కొరటాల శివ.. తన టెక్నికల్ టీమ్‌ని అలర్ట్ చేస్తున్న ఫొటోలతో ఫ్యాన్స్‌లో కాస్త హుషారు వచ్చినా కానీ.. ఎన్టీఆర్ సైడ్ నుంచి మాత్రం ఇంకా ఎటువంటి కదలిక లేకపోవడంతో వారు నిరాశతోనే ఉన్నారు. అలాంటి వారందరికీ తాజాగా ఎన్టీఆర్ ఓ ట్రీట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

 

రీసెంట్‌గా ఎన్టీఆర్‌కి సంబంధించి ఓ లుక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ లుక్ తన 30వ సినిమా కోసమని అంతా అనుకున్నారు. కానీ అదొక కమర్షియల్ యాడ్ కోసమని అప్పుడే వార్తలు వచ్చాయి. సినిమానో, యాడో.. ఏదో ఒకటి ముందు ఎన్టీఆర్ మీడియాలో కనబడటం ముఖ్యం అన్నట్లుగా ఫ్యాన్స్ ఫీలవుతున్న నేపథ్యంలో.. ఆ యాడ్‌ని నేడు జనాల్లోకి వదిలారు. ఈ యాడ్‌లో ఎన్టీఆర్ లుక్ కేక అన్నట్లుగా ఉండటంతో పాటు.. భారీ డైలాగ్స్‌ని ఆయన పలుకుతున్న తీరు ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్‌ని ఇలా చూడటంతో.. వారు పండగ చేసుకుంటున్నారు. పాపులర్ ఇండియన్ పుడ్ డెలివరీ ‘హబ్ లిసియస్ ఫుడ్స్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన ఎన్టీఆర్.. ప్రచారం కోసం చేసిన యాడ్‌లో ‘టెంపర్’ సినిమా కోర్ట్ సీన్‌ను తలపించాడు. రాహుల్ రామకృష్ణ, ఎన్టీఆర్‌ల మధ్య ఈ యాడ్‌లో జరిగిన సంభాషణ వీక్షకులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ ట్రీట్ సరిపోతుందా? అనేదే చూడాలి.

Young Tiger NTR Licious AD Goes Viral:

Licious Treat to Fans From Young Tiger NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs