Advertisement
Google Ads BL

సింహం సింగిల్ గా వస్తుంది: అనిల్ రావిపూడి


ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ సినిమాలతో దర్శకుడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగిన అనిల్ రావిపూడికి ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. అదే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే అవకాశం రావడం. కామెడీ జోనర్ నుండి అనిల్ రావిపూడి బాలయ్యతో ఓ సీరియస్ జోనర్ కి వచ్చేస్తాడేమో అనుకుంటే.. నా మార్క్ కామెడీ, బాలకృష్ణ మార్క్ సీరియస్ నెస్ తోనే సినిమా రాబోతుంది అంటూ అంచనాలు పెంచిన అనిల్ రావిపూడి తన సినిమాలో బాలకృష్ణ సింగిల్ గానే వస్తారంటూ ఆసక్తిని క్రియేట్ చేసారు. 

Advertisement
CJ Advs

కొంతకాలంగా డబుల్ యాక్షన్ తో సూపర్ హిట్స్ కొడుతున్న బాలయ్యని తన సినిమాలో సింగిల్ గానే చూపించబోతున్నట్లుగా ఆయన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రివీల్ చేసారు.

బాలయ్య కేరెక్టర్ కి కామెడీ జత చెయ్యకపోయినా.. కథలో కావాల్సినంత ఫన్ జనరేట్ అయ్యేలా కథ రాసుకున్నట్లు, ఇదో హానెస్ట్ స్టోరీగా ఉండబోతుంది అంటూ ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో నందమూరి ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి బాలయ్య.. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ గర్జిస్తారేమో అంటున్నారు. 

ఈ సినిమాలో బాలయ్యకి కూతురు కేరెక్టర్ లో హీరోయిన్  శ్రీ లీలా కనిపించబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 8 న ముహూర్తపు షాట్ తో మొదలు కాబోతుంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. 

 

NBK108: Balayya Mark Action, Anil Mark Fun:

NBK108 Is An Honest Story: Anil Ravipudi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs