Advertisement
Google Ads BL

జీవితను భయపెట్టిన నాగేంద్రబాబు!


నాగేంద్రబాబు అనగానే మెగాబ్రదర్ నాగబాబు అనుకుంటారేమో.. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ నాగేంద్రబాబు పెద్ద కేటుగాడు. నమ్మించి మోసం చేసే రకం. ఇంకా చెప్పాలంటే సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్. ఈ నాగేంద్రబాబు బారి నుండి నటి జీవితా రాజశేఖర్‌ తృటిలో తప్పించుకున్నట్లుగా ఇప్పుడొక వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. జీవిత తప్పించుకున్నా.. ఆమె మేనేజర్ మాత్రం ఈ బాబుకి దొరికిపోయాడు. లక్షకి పైగా సమర్పించుకున్నాడు. ఆ కథేంటో చూద్దాం. 

Advertisement
CJ Advs

 

ఇటీవల జీవితకు షారుక్ అనే వ్యక్తి నుండి ఫోన్ రావడంతో.. లిఫ్ట్ చేసి మాట్లాడిన ఆమెకు.. జియో సంస్థ ద్వారా లభించే వస్తువులన్నీ.. సగం ధరకే మా ద్వారా లభిస్తాయని.. ఏదేదో చెబుతుంటే.. ఆమె ఇప్పుడు టైమ్ లేదు.. ఏదైనా మా మేనేజర్‌తో మాట్లాడమని చెప్పారట. సదరు వ్యక్తి ఆ మేనేజర్‌కి కాల్ చేసి నమ్మించి.. 2.5 లక్షలు విలువ చేసే వస్తువులను 1.25 లక్షలకు వచ్చేలా ప్లాన్ చేసి ఆన్‌లైన్‌లో మనీ కట్టించుకున్నాడట. అయితే ఆర్డర్ చేసిన వస్తువులు ఎంత వరకు రాకపోవడంతో.. మోసపోయానని భావించిన మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు రంగంలోకి దిగి, షారుక్.. అదే నాగేంద్రబాబుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. చెన్నైకి చెందిన ఈ నాగేంద్రబాబు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లకు ఎవరైనా ఒకటే.. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.

Jeevitha Rajasekhar Shocks with Nagendra Babu Phone Call:

Jeevitha Manager Cheated by a Chennai Man
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs