Advertisement
Google Ads BL

80స్ పార్టీ.. రాధకి చిరు ముద్దులు


గత కొంతకాలంగా.. అలనాటి తారలంతా సంవత్సరానికి ఒకసారి రీయూనియన్ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఒకరు ఈ వేడుకను హోస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు చిరంజీవి ఇంట్లో తారలంతా ఈ వేడుకను జరుపుకున్నారు. సీనియర్ హీరోహీరోయిన్లు అందరూ ఇలా ఒక్కచోట చేరి.. అప్పటి మెమరీస్‌ను గుర్తు చేసుకుంటూ.. ఎంజాయ్ చేస్తుంటే.. చూసే వారికి కూడా ఏదో గొప్ప అనుభూతిని ఇస్తుంటుంది. అందుకే ఈ 80స్ సెలబ్రిటీలకు సంబంధించిన పార్టీ.. అంత హాట్ టాపిక్ అవుతుంది. ఈ సంవత్సరం ఈ వేడుకకి బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ అతిథ్యమిచ్చారు. ఈ పార్టీలో సౌత్, నార్త్ సెలబ్రిటీలెందరో సందడి చేశారు. పార్టీ జరిగి దాదాపు 15 రోజులు అవుతున్నా.. ఇంకా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

 

తాజాగా అప్పటి స్టార్ హీరోయిన్ రాధ తన ట్విట్టర్ వేదికగా ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో తను.. తనకి ఎంతో ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేస్తోంది. ‘‘నాకు ఎంతో ఇష్టమైన పాటకు ఇలా స్టెప్పులు వేసినందుకు చాలా సంతోషంగా అనిపించింది. నా కొలీగ్స్ అందరూ దీనికి ఎంతగానో సపోర్ట్ చేశారు. 80స్ పార్టీ సమయంలోనూ, ఆ తర్వాత.. ప్రతి మూమెంట్‌ని ఎంతగానో ఎంజాయ్ చేశాను’’ అని తెలిపింది. ఇక ఈ వీడియో చూస్తే అంతా షాకవ్వడం ఖాయం. అప్పటికీ ఇప్పటికీ తన డ్యాన్స్‌లో ఎటువంటి మార్పు లేదనేలా స్టెప్స్ వేస్తూ రాధ అలరించింది. ఆమె డ్యాన్స్‌ని చూసిన వారంతా నిజంగా ఫిదా అయిపోయారు. రాధ మెడలో వెంకటేష్ దండ వేస్తే.. చిరంజీవి ఏకంగా ముద్దు, హగ్‌లతో ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Senior Actress Radha Shared Video Creates Sensation:

Mega Star Chiranjeevi Shocked with Radha Dance at 80s Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs