ఘట్టమనేని ఫ్యామిలీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహేష్ కి ఇష్టమైన వారంతా వరసగా కొన్ని నెలల గ్యాప్ లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం మహేష్ కి తీరని లోటు, ఎవరూ ఆయన్ని ఓదార్చలేని విషయం. తండ్రిలా భావించిన అన్నయ్య రమేష్ బాబు, ఎంతో ఇష్టమైన అమ్మ ఇందిరాదేవి, దేవుడిలా భావించే తండ్రి కృష్ణ వెంట వెంటనే మరణించడం నిజంగా మహేష్ కి ఇది కష్టమైన సమయం. మహేష్ బాబు కి ఓదార్పునిస్తూ చేతనైనంత సహాయం చెయ్యాల్సింది పోయి ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. సెలెబ్రిటీ లైఫ్ అంటే పబ్లిక్ లైఫ్ అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఏ ఏ విషయాలను టచ్ చెయ్యాలో తెలియని వారు మనుషులే కారు అనేది కొందరి అభిప్రాయం. సెలబ్రిటీస్ కి కూడా సున్నితమైన సమస్యలు, అంశాలు ఉంటాయి. వాటిని పబ్లిక్ చేసుకోవాలనుకోరు.
కానీ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ప్రాచుర్యం పొందాక.. సెలబ్రిటీస్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పడు ఆ కోవలోకే మహేష్ బాబు తండ్రి కృష్ణగారి మరణం చేరింది. మహేష్ బాబు తండ్రి మరణాన్ని జీర్ణించుకోవాలో.. విమర్శకుల మాటలు పడాలో అర్ధం కానీ పరిస్థితి. తండ్రి మరణంతో భరించలేని బాధని దిగమింగుకున్న మహేష్ బాబు తండ్రి కృష్ణ భౌతిక కాయాన్ని గచ్చిబౌలి స్టేడియం కి తరలించలేదు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినా మహేష్ తుది నిర్ణయంతో పద్మాలయకి తరలించారని, మహేష్ కి, కృష్ణ కి బోలెడన్ని ఆస్తులుండగా.. కృష్ణగారి అంత్యక్రియలు మహా ప్రస్థానంలో చేయడంపై కొంతమంది బహిరంగంగానే విమర్శించారు.
మరోపక్క నిన్న సోమవారం కృష్ణ గారి అస్తికలు కృష్ణా నదిలో కలపడానికి వెళ్ళినప్పుడు నరేష్ ని వెంటబెట్టుకుని వెళ్లకపోవడంపై కూడా విమర్శలు మొదలయ్యాయి. కృష్ణ గారు ఏరికోరి నరేష్ దగ్గరే ఉన్నారు. కానీ నరేష్ అంటే ఘట్టమనేని ఫ్యామిలీకి నచ్చదు. అందులో విజయ నిర్మల, కృష్ణ ఉంటే గౌవరం చూపించేవారు. వారు లేరు. సో నరేష్ చేసే పనులు, లైక్ పవిత్రతో కలిసి అంత్యక్రియలకు రావడం, అక్కడ హాస్పిటల్ కి వెళ్లడం, అలాగే చిన్న కర్మ రోజు జంటగా పూలు వెయ్యడం ఇవన్నీ చూసి మహేష్ చిరాకు పడడం వలనే నరేష్ ని కృష్ణ గారి అస్తికలు కలిపేందుకు పిలవలేదు అనే టాక్ మొదలైంది.
ఇలాంటి విమర్శలతో మహేష్ బాగా డిస్టర్బ్ అవుతున్నాడని, అందుకే దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ ని వదలకుండా తోడుగా ఉంటున్నారంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది సీనియర్ పాత్రికేయులు ముచ్చటించడం హాట్ టాపిక్ గా మారింది.