Advertisement
Google Ads BL

శ్రీకాంత్-ఊహ విడాకులు: షాకవుతున్న ప్రేక్షకులు


టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి, కేరెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి హీరోగా టర్న్ అయిన శ్రీకాంత్.. మళ్ళీ విలన్ వేషాలవైపు మొగ్గు చూపుతున్నాడు. హీరోగా సక్సెస్ అవుతున్న తరుణంలోనే హీరోయిన్ ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. శ్రీకాంత్-ఊహల పెద్ద కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కూతురు కూడా సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నాయి. అయితే పెళ్ళైన 25 ఏళ్లలో శ్రీకాంత్-ఊహలు చాలా ప్రేమగా ఆదర్శంగానే కనిపించారు. పబ్లిక్ లో పెద్దగా ఫోకస్ అవ్వని ఈ జంట ఇప్పుడు విడాకుల కోసం ప్రయత్నం చేస్తుంది అనే న్యూస్ కేవలం వాళ్ల అభిమానులనే కాదు, చాలామందిని అయోమయానికి గురి చేస్తుంది. 

Advertisement
CJ Advs

25 ఏళ్ళ కాపురంలో కలతలు అనేవి సహజం. ఏ ఫ్యామిలిలో అయినా.. సమస్యలు, గొడవలు ఉంటాయి. ఈ 25 ఏళ్లలో శ్రీకాంత్-ఊహ గొడవ పడిన సందర్భాలు ఉండే ఉంటాయి. ఇప్పటివరకు అవన్నీ చక్కబెట్టుకుని కాంప్రమైజ్ అయ్యి ముందుకు నడిచిన శ్రీకాంత్-ఊహలు ఇప్పుడు విడిపోవాలనుకోవడంలో అర్ధం లేదు. ఇలాంటి న్యూస్ రావటంలో అర్ధం లేదు. అసలు శ్రీకాంత్ కానీ, ఊహ కానీ ఈ విడాకుల విషయంలో ఎలాంటి స్పందన లేదు, అలాగే సన్నిహితుల నుండి సమాచారం లేదు. కానీ శ్రీకాంత్-ఊహ విడాకుల విషయం సోషల్ మీడియాని ముంచెత్తింది.

అసలు శ్రీకాంత్-ఊహ విడిపోవాలనుకుంటున్నారా? లేదంటే ఈ రూమర్ ఎవరైనా పుట్టించారా? ఎందుకంటే ఈ మధ్యన నటి స్నేహ ఆమె భర్త ప్రసన్నకి విడాకులివ్వబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగగా.. సోషల్ మీడియాలో భర్త తో ప్రేమగా ఉన్న పిక్ పోస్ట్ చేసి ఆ విడాకుల మేటర్ కి గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది స్నేహ. మరి ఇలాంటి వార్తలు సృష్టించేముందు ఆలోచిస్తే బావుంటుంది. కాదు అది నిజమే అయితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి శ్రీకాంత్-ఊహ ల విడాకుల విషయమై ఎవరో ఒకరు స్పందిస్తే అందరికి ఓ క్లారిటీ ఇచ్చినవారవుతారు. ఇలాంటి న్యూస్ పుట్టించిన వారికీ నోళ్లు మూత పడతాయి. లేదంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Srikanth-Ooha Divorce: Shocking Audience:

Hero Srikanth Divorce With His Wife Ooha?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs