Advertisement
Google Ads BL

నాగ శౌర్య కట్నం తీసుకున్నాడా?


యంగ్ హీరో నాగ శౌర్య కర్ణాటకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి ని వివాహం చేసుకున్నాడు. ఈ ఆదివారమే నాగ శౌర్య-అనుషుల వివాహం బెంగుళూర్ లోని ప్రముఖ హోటల్ లో కుటుంభ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. అందరి మధ్యన నాగ శౌర్య అనూషకి మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. అయితే నాగ శౌర్య-అనుషాల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తారేమో అందుకే పెళ్ళికి ఎవరిని పిలవలేదు అనుకుంటున్నారు. కానీ నాగ శౌర్య ఫ్యామిలీ నాగ శౌర్య-అనుషాల రిసెప్షన్ ని సింపుల్ గా ముగించెయ్యబోతుందట.

Advertisement
CJ Advs

అదలా ఉంటే ఇప్పుడు నాగ శౌర్య అనూష ఫ్యామిలీ నుండి భారీ స్థాయిలో కట్నం తీసుకున్నాడని ప్రచారం ఓ రేంజ్లో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అనూష ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న నాగ శౌర్య అనూష ఫ్యామిలీ నుండి నగదు, డబ్బు రూపేణా వరకట్నం కింద 50 కోట్లు అందుకున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగ శౌర్య ప్రేమించిన అనూష ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్, అలాగే అనూష పేరు మీదున్న ఆస్తులని నాగ శౌర్య మామగారు నాగ శౌర్య పేరు మీద రాసారని, వాటి విలువ 40 నుండి 50కోట్ల వరకు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే నాగ శౌర్య-అనూష లది ప్రేమ పెళ్లి కాబట్టి.. నాగ శౌర్య కట్నం తెలుసుకోకపోవచ్చని కొందరంటుంటే.. కొందరు కట్నం రూపేణా కాకపోయినా బహుమతుల రూపేణా ఇదంతా అందుకుని ఉండొచ్చనే వాదన చేస్తున్నారు.

Did Naga Shaurya take dowry?:

Do you know how much dowry hero Naga shaurya has taken.. All the crores!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs