Advertisement
Google Ads BL

కాంతార ఓటిటీ రిలీజ్ పై బిగ్ కన్ఫ్యూషన్


కన్నడలో తెరకెక్కి పాన్ ఇండియా మార్కెట్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. కలెక్షన్స్ పరంగా మాత్రమేనా.. కంటెంట్ పరంగాను అందరూ చెప్పుకునేలా చేసిన కాంతారా థియేట్రికల్ రన్ ఇంకా ముగియలేదు. నిన్నమొన్నటి దృశ్యం 2 హిందీలో రిలీజ్ అయ్యేవరకు కాంతార హిందీలో కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. తెలుగులోనూ, తమిళంలోనూ, ఏ భాషలో విడుదల చేసినా కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయ్యి ఓటిటిలో వీక్షిద్దామనే ప్రేక్షకులకి మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement
CJ Advs

ఎప్పుడో నెల క్రితమే ఓటిటికి రావాల్సిన ఈ మూవీ రేపు నవంబర్ 24 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ ప్రకటించారు. కానీ అంతలోనే ఆ ప్రకటన డిలేట్ చెయ్యడంతో అసలు కన్ఫ్యూషన్ స్టార్ట్ అయ్యింది. అసలు రేపు శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో కాంతార ని చూడగలుగుతామా అనే నిరాశలోకి వెళుతున్నారు ఆడియన్స్.  ఇంతవరకు అమెజాన్ ప్రైమ్ అధికారిక ఖాతాల్లో కాంతార ఓటిటీ రిలీజ్ పై ఎలాంటి ప్రకటన లేదు, పోనీ రేపు 24 న కాంతార ఓటిటీ రిలీజ్ అని హోంబేలె ఫిలిమ్స్ వారూ చెప్పడం లేదు. 

మరి కాంతార ఓటిటీ విషయంలో మేకర్స్, అమెజాన్ ప్రైమ్ వారు ఎలాంటి ట్విస్ట్ ఇవ్వరు కదా అనే కంగారులో ఆడియన్స్ ఉన్నారు. మరోపక్క అమెజాన్ ప్రైమ్ వారు ఈ మధ్యన ఓటిటీ రిలీజ్ కి ఒక్కరోజు ముందే పబ్లిసిటీ మొదలు పెడుతుంది. అలా ఎమన్నా సర్ ప్రైజ్ ఇస్తారా.. అసలు కాంతార ఓటిటీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో.. ఏమో..

Big confusion over Kantara OTT release:

Kantara OTT release on Nov42th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs