సుడిగాలి సుధీర్ బుల్లితెర హీరో.. ఇది కాదనలేని నిజం. బుల్లితెర మీద ఏ ఛానల్లో అయినా సుధీర్ కున్న క్రేజ్ ఏ యాంకర్ కి గాని, ఏ కమెడియన్ కి లేదు. అందుకే సుధీర్ హీరోగా ట్రై చేసుకుంటున్నాడు. కాదు సుధీర్ కి నప్పే కథలతో దర్శకనిర్మాతలు సుధీర్ పై పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ సుడిగాలి సుధీర్ కి ఆ హీరోయిజం అచ్చిరాలేదు. ఆయన నటించిన సినిమా ఒక్కటీ హిట్ అన్న దాఖలాలు లేవు. ఈమధ్యన మాస్ మూవీ గా అంతగా బజ్ లేకుండానే రిలీజ్ అయిన గాలోడు కూడా అంతే అన్నారు. క్రిటిక్స్ దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు.
కామెడీ చేసుకోకుండా ఈ హీరోయిజం అవసరమా సుధీర్ అనే కామెంట్స్ కూడా చేసారు. కానీ సుడిగాలి సుధీర్ కి లక్కు కాదు సుడి బాగా కుదిరింది. అందుకే గాలోడు ప్లాప్ అన్న నోళ్లే ఈ రోజు కలెక్షన్స్ పరంగా గాలోడు సక్సెస్ ని మాట్లాడుతున్నాయి. మొదటి రోజునుండి గాలోడు కలెక్షన్స్ పరంగా మంచి మార్క్ ని సెట్ చేసింది. విష్ణు జిన్నా కలెక్షన్స్ కన్నా గాలోడు కలెక్షన్స్ పరంగా టాప్ అంటూ సుధీర్ ఫాన్స్ ప్రచారం మొదలు పెట్టినట్లుగానే మొదటి వీకెండ్ లోనే నిర్మాతలను ప్రాఫిట్ లో పడేసాడు సుధీర్. వరల్డ్ వైడ్ గా గాలోడు సినిమా మొదటి వీకెండ్ లో 4.06 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్, 2.25 కోట్ల వరకు షేర్ దక్కించుకుంది.
నెగెటివ్ టాక్, నెగెటివ్ రివ్యూస్ వచ్చినా గాలోడుకి ఈ రేంజ్ కలెక్షన్స్ చూసిన వారు సుడిగాలి సుడి మాములుగా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ క్రేజ్ ఉంది కాబట్టే సుధీర్ ఇలా ధైర్యం చేసి సినిమాలు చేస్తుంటే.. బుల్లితెర యాజమాన్యాలు.. ఎంత పారితోషకమైన ఇచ్చి షోస్ కి హోస్ట్ గా చేయించుకుంటున్నాయి. ఇక ఈ వారం సుధీర్ గాలోడు సినిమాకి ఎదురు నిలబడే సినిమాలు కూడా ఏమి లేకపోవడంతో గాలోడుకి కలిసొచ్చింది. మాస్ కళ కనిపించడంతో మాస్ ఆడియన్స్ గాలోడుని హిట్ చేసేసారు.