అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కలయికలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచిన పుష్ప ద రైజ్ సాంగ్స్ క్రికెట్ మైదానంలోనూ, పెళ్లిళ్లు, పేరంటాల్లోనూ, కాలేజ్ ఫెస్టివల్స్ లోను ఇప్పటికి మోగుతూనే ఉన్నాయి. స్టార్ క్రికెటర్స్ అయితే పుష్ప సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆ ఆల్బమ్ ని బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. రష్మిక కూడా పుష్ప ప్రమోషన్స్ లో సామి.. రారా సామి అనే సాంగ్ కి డాన్స్ చేసి బాగా హైలెట్ అయ్యింది. ఇప్పుడు అదే సాంగ్ కి ముంబైలో కుర్ర హీరోయిన్ జాన్వీ కపూర్ స్టేజ్ పై అదిరిపోయే స్టెప్స్ తో ఆకట్టుకుంది.
ఆకట్టుకుంది కాదు ఊపేసింది, ఉర్రుతలూగించింది అనే చెప్పాలి. పిచ్చెక్కించే గ్లామర్ డ్రెస్ తో అందాలు ఆరబోస్తూ సామి.. రారా సామి అంటూ జాన్వీ కపూర్ స్టెప్స్ స్టేజ్ కింద వారిని ఊపేసాయి. ముంబైలో రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో జాన్వీ కపూర్ పుష్ప ఆల్బమ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సామి.. రారా సామి అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
అయితే ఈ సాంగ్ లో రష్మిక గ్లామర్ కన్నా, ఆమె స్టెప్స్ కన్నా ఎక్కువగా జాన్వీ కపూర్ గ్లామర్ అలాగే ఆమె డాన్స్ బెటర్ గా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ స్టెప్స్ ఎలా ఉన్నాయో, గ్లామర్ ఏ రేంజ్ లో ఉందో ఈ పిక్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి.