స్టార్ కిడ్స్ లో మోస్ట్ పాపులర్ కిడ్స్.. మహేష్ కూతురు సితార, అల్లు అర్జున్ కూతురు అర్హ లే. ఎందుకంటే ఈ ఇద్దరూ తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న క్రేజీ పిల్లలు. అల్లు అర్హ చిన్నప్పటి నుండే కూతురు అల్లరిని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇస్తుండేవారు. ఈ రోజు అల్లు అర్హ బర్త్ డే. కూతురు పుట్టిన రోజు నాడు అల్లు అర్జున్ ఓ క్యూట్ వీడియో ని షేర్ చేస్తూ అందులో కందిరీగ కథ చెబుతూ కూతురికి బర్త్ డే విషెస్ తెలియజేసాడు.
అల్లు అర్హ ని ఏముందక్కడ అని అల్లు అర్జున్ అడగ్గానే.. ఆ కందిరీగలు నా జుట్టులోకి వెళుతున్నాయి.. అంది అర్హ. ఆ పుట్ట ఎక్కడుంది. అక్కడే కింద ఉంది.. పొగ పెట్టి ఏం తీశారు అనగానే.. తీసినారు అంది అర్హ. ఏం తీసినారు.. తెలంగాణ మాట్లాడుతున్నావ్ అని ముద్దు చేసాడు అల్లు అర్జున్. ఎందుకు భయపడుతున్నావ్ అనగానే ఆ కందిరీగలు కుడుతున్నాయ్ అంది.. అవి ఎక్కడున్నాయి కింది ఫ్లోర్ లో అంది అర్హ.. ఆ వీడియో ని షేర్ చేస్తూ కూతురికి స్వీట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు అల్లు అర్జున్.
Happy Birthday to the cuteness of my life . #alluarha #కందిరీగకథలు 😂 pic.twitter.com/83hQt0iKMn
— Allu Arjun (@alluarjun) November 21, 2022