Advertisement
Google Ads BL

‘మసూద’ బ్యూటీ మస్త్ సిగ్నల్స్ ఇస్తోంది


కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోగిపోతోంది. కారణం ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘మసూద’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని విజయవంతంగా రన్ అవుతోంది. వాస్తవానికి సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ.. ఆమె అందంతో పాటు వాయిస్.. యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. దీంతో ఇప్పుడందరి చూపు ఈ అమ్మడిపైనే పడుతుండటం విశేషం. అందుకు మరో కారణం కూడా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసే ఫొటోలు చూస్తే.. ఎవరికైనా మతి పోవాల్సిందే. లేలేత సొగసులతో.. మస్త్ సిగ్నల్స్ ఇస్తూ.. నెటిజన్లను కవ్విస్తోన్న తీరు కూడా ఆమె గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేస్తోంది. చూస్తుంటే.. త్వరలోనే ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఆమె టాప్ స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా కొందరు విమర్శకులు సైతం రాస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ బ్యూటీ ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

Advertisement
CJ Advs

 

అయితే.. హీరోయిన్‌గా ‘మసూద’ ఆమెకు తొలి చిత్రం కావచ్చు కానీ.. ఈ కావ్య కళ్యాణ్ రామ్ మరెవరో కాదు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ‘గంగోత్రి’ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి. చిన్నప్పుడే చిరంజీవి, బాలయ్య, నాగార్జున, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో ఆమె నటించింది. ‘గంగోత్రి’ సినిమాలో ‘వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట’ సాంగ్ బాల నటిగా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె హీరోయిన్‌గా దర్శనమిచ్చి.. తొలిచిత్రంతోనే హిట్టందుకుంది. ఇప్పుడామె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అవి కూడా హిట్టయితే.. ఇక ఈ భామ పేరు భారీగా మోగడం ఖాయం. 

Kavya Kalyan Ram Creates Heat in Tollywood:

Masooda Heroine Kavya Kalyan Ram Insta Pics Goes Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs