Advertisement
Google Ads BL

సింగిల్ టేక్.. బాలయ్య షాక్!


పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే షాకిచ్చిందంటే.. ఆమె మాములు లేడీ కాదు. ఎవరా ఫైర్ బ్రాండ్ అనుకుంటున్నారా? వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ నటి అయినప్పటికీ తెలుగులో ఆమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ రోల్స్‌కి అవకాశం ఉన్నా కూడా.. వరాలు వైవిధ్యతను చాటుకుంటోంది. ‘క్రాక్’ సినిమాలో జయమ్మ తరహా పాత్రలకు తనే ఆప్షన్ అన్నట్లుగా ప్రజంట్ పరిస్థితిని మార్చేసింది. ఇప్పుడు ఏకంగా నందమూరి నటసింహ సినిమాలోనే అవకాశాన్ని అందుకుంది. ఇందులో వరలక్ష్మీ ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పాడు. ‘క్రాక్’లో జయమ్మగా అరిపించేసిన వరలక్ష్మీకి.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో ఏ తరహా పాత్ర దక్కిందో తెలియాలంటే రాబోయే సంక్రాంతి వరకు వెయిట్ చేయక తప్పదు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వరాలు కుమ్మేసిందనే అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి వరలక్ష్మీ ఓ విషయాన్ని షేర్ చేసుకుంది. 5 పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పడంతో.. సెట్‌లోని వారంతా షాక్ అయినట్లుగా ఆమె వెల్లడించింది. అందులో బాలయ్య కూడా ఉండటమే ఇక్కడ విశేషం. ‘‘బాలకృష్ణగారి ‘వీరసింహా రెడ్డి’ సినిమాలో చేస్తున్నా. ఇందులో నాకు ఐదు పేజీల డైలాగ్‌ ఇచ్చారు దర్శకుడు. ఆ సీన్‌ కోసం మూడు రోజులు ప్లాన్‌ చేశారు. డైలాగ్‌ని ముక్కలు ముక్కలుగా కట్‌ చేసి షూట్‌ చేద్దామనుకొన్నారు. కానీ నేను ఆ ఐదు పేజీల డైలాగ్‌ని సింగిల్‌ టేక్‌లో చెప్పేశా. దాంతో బాలయ్యతో సహా యూనిట్‌ అంతా చప్పట్లు కొట్టేసింది. ఇది నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూమెంట్.‌.’’ అంటూ వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. ఆ డైలాగ్ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వెయిట్ చేయమంటోంది.

Balayya Shocked with Varalaxmi Sarathkumar Acting :

Varalaxmi Sarathkumar about Veera Simha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs