Advertisement
Google Ads BL

ఎమోషనల్ ట్రాక్ తో NBK108


బాలకృష్ణ వీర సింహ రెడ్డి తర్వాత కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చెయ్యబోతున్నారు. ప్రస్తుతం వీర సింహ రెడ్డి లాస్ట్ షెడ్యూల్ లో తలమునకలైన బాలయ్య బాబు.. మధ్యలో ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నారు. ఇక వచ్చే నెల అంటే డిసెంబర్ 8 న అనిల్ రావిపూడి తో బాలకృష్ణ NBK108 ని అఫీషియల్ గా మొదలు పెట్టి అదే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టెయ్యనున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే మళ్ళీ బాలకృష్ణ వీర సింహ రెడ్డి ప్రమోషన్స్ కి జంప్ అవుతారు. సంక్రాంతికి వీర సింహ రెడ్డి విడుదల తర్వాత కూల్ గా అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లోకి వస్తారట.  

Advertisement
CJ Advs

అయితే NBK108 మొదటి షెడ్యూల్ పై ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలయ్యని కాస్త ఓల్డ్ గా అంటే తండ్రి పాత్రలో అనిల్ చూపించబోతున్నారని ఎప్పుడో రివీల్ చేసారు. ఆయనకి కూతురుగా హీరోయిన్ శ్రీలీల నటించనుంది. అయితే మొదటి షెడ్యూల్ లోనే అనిల్ రావిపూడి బాలకృష్ణ-శ్రీలీల లపై ఎమోషన్ సన్నివేశాలని తెరకెక్కిస్తారట. ఇప్పటికే ఈ సీన్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుందట. ఈ షెడ్యూల్ తర్వాత లాంగ్ గ్యాప్ తో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది.

NBK108 మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ దిగబోతున్నారనే టాక్ నడుస్తుండగా.. త్రిషని బాలయ్యకి జోడిగా చూపించాలని అనిల్ డిసైడ్ అయినట్లుగా టాక్.

NBK108: Balakrishna, Sree Leela to kickstart with emotions:

NBK108 to start with an emotional track
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs