Advertisement
Google Ads BL

సలార్ యాక్షన్ ఎవ్వరూ ఊహించలేరు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కుతున్న సలార్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సలార్ కి సంబందించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో స్ప్రెడ్ అవుతుంది. అందులో సలార్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించడంతో ఆ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సలార్ షూటింగ్ ని చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్ యాక్షన్ సన్నివేశాల విషయంలో ఏ న్యూస్ అయినా ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా సలార్ షూటింగ్ లో భాగమైన పృథ్వీ రాజ్ సుకుమార్ అయన భార్య సలార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పృథ్వీ రాజ్-ప్రభాస్ తలపడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. షూటింగ్ లో పాల్గొంటున్న పృథ్వీ రాజ్ ప్రశాంత్ నీల్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ విజన్ కి, ప్రతిభకు తాను ఫిదా అయ్యానని చెప్పిన ఆయన సలార్ లోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా డిజైన్ చేసారని, ఈ యాక్షన్ సీన్స్ సలార్ లో మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తాయనడంలో సందేహమే లేదు అంటూ సలార్ పై మరిన్ని అంచనాలు పెంచేశారు పృథ్వీ రాజ్.

Prithviraj Sukumaran interesting comments on salaar action scene:

Prithviraj Sukumaran in Salaar action scene
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs