Advertisement
Google Ads BL

జనసేన యాక్షన్.. పోసానిపై కేసు


పవన్ కల్యాణ్ జనసేన పార్టీ యాక్షన్‌లోకి దిగింది. మొన్నటి వరకు కాస్త కూల్‌గా ఉన్న పవన్ కల్యాణ్.. ఈ మధ్య వైసీపీ నాయకుల్లానే.. తిట్లదండకం మొదలెట్టారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే విధంగా.. వైసీపీ నాయకులని ఎదుర్కొవాలంటే.. వారిలాగే బూతులే కరెక్ట్ అనే ప్రాసెస్‌ని జనసేన స్టార్ట్ చేసింది. చాలా వరకు సక్సెస్ కూడా అయింది.. అవుతోంది. ఇక విషయంలోకి వస్తే.. ఆ మధ్య సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని పవన్ కల్యాణ్ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ఎండగట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌పై వైసీపీ వీరాభిమాని అయిన పోసాని.. ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఫైర్ అయ్యాడు. పార్టీ పరంగా, సినిమాల పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌ని దూషించడంతో.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు కూడా అంతే స్థాయిలో ఆయనపై తిరుగుబాటు చేశారు. ఆ దెబ్బతో కొంతకాలం కనిపించకుండా పోయిన పోసానికి.. వైసీపీ ప్రభుత్వం ఈ మధ్య పిలిచి మరీ ఓ పదవి కట్టబెట్టింది. 

Advertisement
CJ Advs

 

పవన్ కల్యాణ్‌ని తిట్టే స్థాయిని బట్టి వైసీపీలో పదవులు అన్నట్లుగా.. పోసానిని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆ ప్రభుత్వం నియమించింది. అయితే పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా దూషించిన పోసానిపై మాత్రం అప్పట్లో ఎక్కడా కేసు నమోదు కాలేదు. కాదు, కాదు పోలీసులెవరూ కేసు ఫైల్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం వారిది.. పోలీసులు కూడా ఆ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుండటంతో.. జనసేన నేతలు ఎంతగా ప్రయత్నించినా.. పోలీసులు కేసు ఫైల్ చేయలేదు. దీంతో రాజమండ్రికి చెందిన ఇందిర అనే జనసేన వీర మహిళ ఏకంగా కోర్టును ఆశ్రయించి.. పోసానిపై కేసు నమోదు అయ్యేలా చేయగలిగింది. 

 

రాజమండ్రి స్థానిక కోర్టు ఆదేశాల ప్రకారం.. పోసానిపై పోలీసులు యాక్షన్ తీసుకోక తప్పలేదు. ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పదవి వచ్చిన ఆనందంలో ఉన్న పోసానికి జనసేన యాక్షన్‌తో దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింటుందని అంతా అనుకుంటున్నారు.. కానీ.. ఈ కోర్టులు, కేసులు వైసీపీ వారికి కొత్తేం కాదని గమనించాలి. ఎందుకంటే.. ఆ పార్టీ నాయకుడిపైనే బోలెడన్ని కేసులున్నాయి.. అయినా ఏమైనా చేయగలిగారా? ఇదీ అంతే.. కాకపోతే, కేసు ఫైల్ చేయించి.. విజయం సాధించమనే సంతృప్తి తప్ప జనసేన నేతలకు మిగిలేది కూడా ఏమీ లేదు. 

Case Against Actor Posani Krishna Murali:

Big Shock to Posani Krishna Murali from Janasena
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs