రాజమౌళి ఇంకా ఇంకా ట్రిపుల్ ఆర్ మూడ్ లోనే కనిపిస్తున్నారు. ఇండియా వైడ్ గా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ట్రిపుల్ ఆర్ జపాన్ లోను దూసుకుపోయింది. జపాన్ లో ట్రిపుల్ ఆర్ విడుదల చేసేందుకు రాజమౌళి అక్కడ కూడా ప్రమోషన్స్ చేసారు. అయితే అప్పుడప్పుడు మహేష్ తో చెయ్యబోయే సినిమాపైన కూడా రాజమౌళి చిన్న చిన్న అప్ డేట్స్ ఇస్తున్నారు. మహేష్ బాబు తో రాజమౌళి అడ్వంచర్ థ్రిల్లర్ చేయబోతున్నట్లుగా చెప్పి ఎప్పటినుండో సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తో చెయ్యబోయే సినిమా అప్ డేట్ ఇచ్చి క్యూరియాసిటీని మరింతగా పెంచేశారు.
నేను, నాన్న (విజయేంద్ర ప్రసాద్) రెండు నెలల క్రితం మహేష్ తో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్‌ని స్టార్ట్ చేశాం. కానీ ఇప్పటికీ ఆ వర్క్ ప్రారంభ దశలోనే ఉంది. అందుకే మహేష్ తో చెయ్యబోయే కథని ప్రస్తుతానికి కరివీల్ చేయలేను. కానీ ఈ సినిమాలో ఇండియానా జోన్స్ తరహా క్యారెక్టర్‌లో మహేష్ బాబు కనిపిస్తాడు అని చెప్పగలను. నాకు ఎప్పటి నుంచో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ చేయాలని ఉంది. ఇప్పుడు అది మహేష్ తో చేయబోతున్నా అంటూ రాజమౌళి మహేష్ సినిమాపై ఓ హింట్ ఇచ్చారు.
ఇక మహేష్ కూడా ప్రస్తుతం తండ్రి పోయిన బాధలో ఉన్నారు. కృష్ణగారి దశదిన కర్మలు పూర్తయ్యాక ఆయన త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. అది ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది.