యంగ్ హీరో నాగ శౌర్య ఈ రోజు నవంబర్ 20 ఆదివారం బెంగుళూర్ కి చెందిన అనూషతో ఏడడుగులు నడవబోతున్నాడు. మరికొద్ది సేపట్లో మొదలు కానున్న నాగ శౌర్య పెళ్లి కి సంబందించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నిన్న బెంగుళూర్ లోని ప్రముఖ హోటల్ లో జరిగాయి. నాగ శౌర్య షూటింగ్ స్పాట్ లో సొమ్మసిల్లి పడిపోవడం, ఆ వెంటనే ఆయనకి వైరల్ ఫీవర్ రావడంతో నాగ శౌర్య శుక్రవారం వరకు ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ నీరసం నాగ శౌర్యాని ఇంకా వదల్లేదు. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో మోహంలో నవ్వు కనబడినా ఆయన ఫేస్ లో నీరసం మాత్రం ఎవరి దృష్టిని దాటి పోలేదు.
శనివారం ఉదయమే బెంగుళూర్ కి వెళ్ళిన నాగ శౌర్య ఫ్యామిలీ సాయంత్రం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా హల్దీ సెర్మోని, అలాగే కాక్ టైల్ పార్టీలో హడావిడి చేసారు. ఈ వేడుకలు జరుగుతున్న టైమ్ లోనే నాగ శౌర్య తనకు కాబోయే భార్య అనూష శెట్టికి ఉంగరం తొడిగాడు. నాగ శౌర్య పార్టీ వేర్ లో కనిపించగా.. అనూష డిజైనర్ వెర్ లో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోయింది. అనూష కర్ణాటకకు చెందిన కుందాపూర్ అమ్మాయి. ఆమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్.
నాగ శౌర్య పెళ్లి వేడుకలకి ఆయనకు సన్నిహితులైన ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తుంది. శౌర్య వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ నిర్మాత నాగ వంశి కనిపించారు. ఈ రోజు జరగబోయే పెళ్ళికి కూడా అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది.