Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, ప్రభాస్ నాకేమి సహాయం చెయ్యలేదు


సీనియర్ నటులు చాలామంది పూట గడవడానికి కూడా దిక్కులేక చాలా ఇబ్బందులు పడుతూ తమకి ఎవరైనా సహాయం చేస్తారేమో అంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. అందులో ఇప్పుడు టాలీవుడ్ లో పావలా శ్యామల అనే సీనియర్ నటి దీన గాధ ఇలానే ఉంది. ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. చిరు ఆమెకి రెండు లక్షలు సహాయం చేసారు. అలాగే ఇంకా కొంతమంది కూడా ఆమెకి సహాయం చేసారు.

Advertisement
CJ Advs

కానీ కరాటే కళ్యాణి ఈ విషయంలో కాస్త కాంట్రవర్సీ లేవనెత్తింది. అది తాను సహాయం చెయ్యడానికి వెళితే డబ్బు రూపేణా చెయ్యమని, తనకి తిండి గింజలు వద్దని చెప్పింది, ఆమెకి సహాయం తీసుకునే అర్హత లేదు అంటూ ప్రెస్ మీట్ చెప్పింది. అయితే తాజాగా పావలా శ్యామల మరోమారు ఈ విషయమై పెదవి విప్పింది. తనకి చిరంజీవి గారు సహాయం చెయ్యడమే కాకుండా మా లో సభ్యత్వం ఇప్పించారని, ప్రతినెలా కొంత మొత్తం వచ్చేలా ఏర్పాటు చేసారని, ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికి మర్చిపోను అని చెబుతుంది ఆవిడ.

కానీ తనకి మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి హీరోలు అంతా తలా పది లక్షలు ఇచ్చారంటూ ఎవరో ప్రచారం చేసారు. కానీ వారి నుండి తనకి ఒక్క రూపాయి సహాయం దక్కలేదని, వాళ్ళిచ్చిన సహాయంతోనే నేను ఇప్పుడు హాయిగా ఉన్నానని కూడా ప్రచారం చేసారు. దాని వలన నాకు చిన్న చిన్న సహాయాలు చేసేవారు కూడా వెనక్కి వెళ్లిపోయారు, ఇదంతా నాకు సహాయం దక్కకూడదనే ఒక మహాతల్లి చేసింది అంటూ కరాటే కళ్యాణిపై ఇండైరెక్ట్ గా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.   

Mahesh, NTR, Prabhas did not help me: Pavala Shyamala :

Pavala Shyamala Sensational comments on Karate Kalyani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs