Advertisement
Google Ads BL

ప్రాజెక్ట్ K పై అంచనాలు పెంచిన నాగ్ అశ్విన్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రపంచం మెచ్చే సినిమా చెయ్యడమే లక్ష్యంగా పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ K షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో అదిరిపోయే సెట్ వేసి అందులో మిగతా షూటింగ్ చిత్రికరణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీపికా పడుకొనే, దిశా పటాని, అమితాబ్ లాంటి బాలీవుడ్ దిగ్గజాలతో ప్రాజెక్ట్ కే ని తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాని భారీ నుండి అతి భారీ బడ్జెట్ తో తీర్చిదిద్దుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా నాగ్ అశ్విన్ సినిమా చిత్రీకరణ ఆలస్యంపై స్పందిస్తూ ఇదేమి ఆషామాషి ప్రాజెక్ట్ కాదు, ఇది సాధారణ సినిమా కాదు, ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను సిల్వర్ స్క్రీన్ మీద చూడలేదని, స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రాజెక్ట్ K కోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించాలి, టెక్నీకల్ గా కూడా కొత్తగా ఉండబోతుంది. అసలు ఈ సినిమా ఎలా చెయ్యాలనే ఆలోచన చెయ్యడానికే బోలెడంత సమయం పడుతుంది. అన్నీ కొత్తగా తయారుచేయాలి. మహానటి సినిమా కోసం కారు కావాలంటే అద్దెకు తెచ్చుకున్నాం.

కానీ ప్రాజెక్ట్ K కోసం కారు కావాలంటే అద్దెకి తెచ్చుకోవడానికి కుదరదు కొత్తగా తయారు చేసుకోవాలి. కాబట్టి కచ్చితంగా సినిమా కొత్తగా అయితే ఉంటుంది అంటూ అంచనాలు మరింతగా పెరిగేలా చేసారు నాగ్ అశ్విన్. గతంలోనే ప్రాజెక్ట్ K కార్ల గురించి కార్ల కంపెనీ దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుండి కొంత అనుమతి కూడా పొందాడు  నాగ్ అశ్విన్. వీటన్నిటి కోసమే కొత్తగా కెమికల్ ఇంజినీర్లను తీసుకున్నారట. ఇంకొంతమంది కొత్త టెక్నీషియన్లు ఈ సినిమా నిర్మాణంలో భాగం చేస్తున్నారని తెలుస్తుంది. 

Nag Ashwin raised expectations on Project K:

Nag Ashwin Seeks Anand Mahindra Help For Prabhas Project K
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs