Advertisement
Google Ads BL

బన్నీ వాస్.. ఈ సీరియల్‌కి అంతం లేదా?


బాబూ.. బన్నీ వాస్ ఈ సీరియల్‌కి అంతం లేదా?. ఏందీ లొల్లి.. చూడలేక చచ్చిపోతున్నాం. బన్నీ వాస్ విషయంలో బోయ సునీత చేస్తున్న హంగామా, రచ్చ చూసిన వారంతా అనుకుంటున్నది ఇదే. అంతంలేని సీరియల్‌లా ఆమె ఈ విషయాన్ని సాగదీస్తుంది. కాకపోతే టెలివిజన్‌లోని సీరియల్స్ ప్రతి రోజూ వస్తే.. ఈ సీరియల్ మాత్రం నాలుగు నెలలకి ఒకసారి గీతా ఆర్ట్స్ సంస్థ ముందు ప్లే అవుతుంటుంది. మొదట్లో ఆమె హడావుడి చూసి ఇంకేముంది.. బన్నీ వాస్.. అలాంటోడు, ఇలాంటోడు అని అంతా అనుకున్నారు. కానీ, ఆమె పదే పదే గీతా ఆర్ట్స్ ముందు నగ్న ప్రదర్శనకు దిగడం చూసి.. ఖచ్చితంగా ఆమె ఏదో డిజార్డర్ సమస్యతో బాధపడుతుందనేది నిజమని ఇప్పుడంతా అనుకుంటుండటం గమనార్హం. 

Advertisement
CJ Advs

 

ఇప్పటికి రెండు సార్లు ఆమెకు ట్రీట్‌మెంట్ జరిగినా, కోర్టు వరకు ఈ విషయం వెళ్లినా.. బోయ సునీతలో మాత్రం మార్పు రాలేదు. మళ్లీ మళ్లీ అదే పని చేస్తుంది. నిజంగా ఏదైనా విషయం ఉంటే.. దానిని సాధించుకునే మార్గం అయితే ఇదైతే కాదు. ఆమె వ్యవహారం చూస్తుంటే మాత్రం.. ఇదంతా కక్షపూరితంగా చేస్తుందా, లేదంటే కావాలనే ఇలా చేస్తుందా? అనేది కూడా అర్థంకాని విషయం. బన్నీ వాసుకే కాదు.. ఇంకా చాలా మంది విషయంలో ఆమె తీరు ఇలానే ఉందనేది ఇక్కడ షాకింగ్ విషయం. పోలీసులు హెచ్చరించినా.. ఎందుకు ఆమె ఇలా ప్రవర్తిస్తుందనేది మాత్రం అంతం లేని సీరియలే కాదు.. అంతు చిక్కని ప్రశ్నగా కూడా మారిపోయింది. 

 

ఎందుకంటే, నిజంగా ఆమె మనీ కోసమే ఇదంతా చేస్తుందీ అనుకుంటే.. సెటిల్ చేయడానికి బన్నీ వాసుకి పెద్ద ఇష్యూనే కాదు. అక్కడికి ఆమె ట్రీట్‌మెంట్‌కి కొంత అమౌంట్‌ని ఆయన ఇచ్చినట్లుగా ఇది వరకు వార్తలు కూడా వచ్చాయి. ఒకవైపు తన పరువు పోతున్నా, తన కుమార్తెను చంపేస్తానని బెదిరించినా.. పలు సందర్భాలలో ఆమె ఈ సమస్య నుంచి కోలుకోవాలని బన్నీ వాసు చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. కానీ, ఆమె తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆమె లిస్ట్‌లో బన్నీ వాసులాంటి బాధితులు ఎందరో ఉన్నారనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. పదే పదే వారిని ఎందుకు ఆమె టార్గెట్ చేస్తుంది? నిజంగా ఆమెకు వారితో ఏదైనా సమస్య ఉంటే.. ఇలా గ్యాప్ ఇచ్చి మరీ ఎందుకు రచ్చ చేస్తుంది? వారి బిడ్డలను చంపేస్తానని ఎందుకు బెదిరిస్తుంది? అసలు.. నాలుగు వారాలకో.. లేదంటే నాలుగు నెలలకి ఒకసారి వచ్చే ఈ సీరియల్‌కి అంతమెప్పుడు?

What is the Ending in Sunitha Boya and Bunny Vas Issue:

Bunny Vas and Boya Sunitha The Unending Serial
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs