Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: రేవంత్-శ్రీహన్ పై తీవ్ర వ్యతిరేఖత


బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ ఫెవరెట్ గా దూసుకుపోతున్న రేవంత్ హౌస్ మేట్స్ కి అస్సలు పడడం లేదు. టాస్క్ పెరఫార్మెన్స్ లో రేవంత్ ఎంతవరకు అయినా వెళతాడు. ఫిజికల్ ఫిజికల్ అంటూ గత వారం అతన్ని రెచ్చగొట్టి కెప్టెన్సీ కంటెండర్ కానివ్వలేదు. వ్యక్తి గతంగా అతనెంత మంచివాడిగా ఉన్నప్పటికీ.. టాస్క్ పరంగా అతను విశ్వరూపం చూపించడం హౌస్ మేట్స్ కి మింగుడు పడడం లేదు. మరోవైపు శ్రీహన్ -శ్రీసత్య ల స్నేహం కూడా ఎవరికీ నచ్చడం లేదు. ముఖ్యంగా ఇనాయ, కీర్తి అది భరించలేకపోతున్నారు. ఇద్దరూ కలిసి కట్టుగా ఆడుతున్నారంటూ వారిని ఫ్రేమ్ చేస్తున్నారు. శ్రీ సత్యపై, శ్రీహన్ పై పర్సనల్ ఎటాక్ చేస్తున్నారు. శ్రీహన్ కూడా ఇనాయ, కీర్తి విషయంలో కాస్త ఓవర్ గానే వెళుతున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో హౌస్ మేట్స్ అంతా రేవంత్-శ్రీహన్ లపై ఎంత కసిగా ఉన్నారో అనే విషయాన్ని హౌస్ మేట్స్ ప్రత్యక్షంగా చూపించారు. విన్నర్ అయ్యే ప్రైజ్ మనీతో కొంత కొంత కట్ చేస్తూ హౌస్ మేట్స్ ని పరుగులు పెట్టించారు. అలా ఫైనల్ ఫ్రెమ్ లోకి రేవంత్, శ్రీహన్, ఫైమాలు వెళ్లగలిగారు. అయితే హౌస్ మేట్స్ ఎవరిని సపోర్ట్ చేస్తారో చెయ్యమని, కానీ వాళ్ళకి ఇసుక మూటలు పెట్టమనగానే ఆది రెడ్డి నేను ఫైమాని సపోర్ట్ చేస్తున్నా అంటూ ముందుగా పరుగులు పెట్టి ఇసుక మూటని శ్రీహన్ కి తగిలించాడు. 

తర్వాత ఇనాయ కూడా నేను అమ్మాయినే సపోర్ట్ చేస్తా అంటూ శ్రీహన్ కి ఇసుక తగిలించింది. శ్రీ సత్య మాత్రం ఫైమాకి ఇసుక మూట వెయ్యగా.. శ్రీహన్ మాత్రం బరువు మొయ్యలేక ఇసుక మూటలు పడేసాడు. తర్వాత రేవంత్ కూడా మొయ్యలేక అరుస్తున్నాడు. హౌస్ మేట్స్ లో చాలామంది రేవంత్ కి శ్రీహన్ కి వ్యతిరేఖగానే ఫైమాకి సపోర్ట్ చేసారు. దానిని బట్టి వీళ్లపై హౌస్ మేట్స్ లో ఎంత వ్యతిరేఖత ఉందో స్పష్టమవుతుంది.

Bigg Boss 6: Contestants to compete for eviction-free pass task:

Bigg Boss 6: Srihan Gives Up, Revanth Stumbles & Faima Wins Eviction-Free Pass Task?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs