Advertisement
Google Ads BL

విడాకులపై హీరో నిఖిల్ సూపర్ ట్విస్ట్


యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టేసి ఇప్పుడు కార్తికేయ 3 షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు. మధ్యలో ఆయన నటించిన 18 పేజెస్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. కెరీర్ లో 2022 ని బ్లాక్ బస్టర్ ఇయర్ గా చెప్పుకునే నిఖిల్ కి.. పర్సనల్ గా ఈ ఏడాది చాలా లాస్ అన్నారు. కారణం నిఖిల్ తన వైఫ్ కి విడాకులు ఇవ్వబోతున్నాడనే రూమర్ క్రియేట్ చేసారు. కార్తికేయ 2 విడుదలకు ముందు నుండే నిఖిల్ భార్య కారణంగా సఫర్ అవుతున్నాడనే న్యూస్, ఆయన భార్య తో విభేదాలు అనే న్యూస్ హైలెట్ అవుతూనే ఉంది. 

Advertisement
CJ Advs

గత ఆరుకి నెలలుగా నిఖిల్ ఈ విషయంలో రిప్లై కూడా ఇవ్వలేదు. మరోపక్క నిఖిల్ కి భార్య పల్లవికి ఇరు కుటంబాల వారు నచ్చజెబుతున్నారని, కానీ నిఖిల్-పల్లవి వినడం లేదని, దానితో ఇరువురు విడాకులకు సిద్దమయ్యారనే వార్త గట్టిగానే ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇన్నాళ్లు ఈ విషయమై సైలెన్స్ ని మెయింటింగ్ చేసిన నిఖిల్ తాజాగా దానిపై ట్విస్ట్ ఇవ్వడమే కాదు, విడాకులపై సూపర్ క్లారిటీ ఇచ్చేసాడు. తన భార్యతో కలిసి దిగి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. నువ్వు పక్కన ఉన్న ప్రతిసారి కూడా అద్భుతం అని చెబుతూ.. భార్య పేరును ట్యాగ్ చేశాడు. 

ఆ పిక్ తో వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో అర్ధమవుతుంది. అదే ఫోటో వీరి విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టేసింది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఈ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nikhil romantic retort to divorce rumours:

Nikhil cut shorts divorce rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs