బుల్లితెర మీద అందునా ఈటీవీలో యాంకర్ రష్మీ-సుడిగాలి సుధీర్ కి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వారి ఆన్ స్క్రీన్ లవ్ కి పదేళ్లు దాటిపోయినా ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. జబర్దస్త్ లోనే కాదు, ఢీ డాన్స్ షోలోనూ రష్మీ-సుధీర్ ల రొమాంటిక్ యాంగిల్ బాగా పాపులర్ అవ్వగా.. వారి మీద పంచ్ లు వేస్తూ కామెడీ పుట్టించే ఆది ఇప్పటికి వారి మీద అదే రకమయిన కామెడీ చేస్తాడు. అయితే రష్మీకి -సుధీర్ కి మధ్యన వున్న స్క్రీన్ కెమిస్ట్రీ, ఎఫ్ఫైర్ తప్ప బయట వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని వారి స్నేహితులు చెప్పడమే కాదు, వారిద్దరూ కూడా అదే చెబుతారు.
ఈమధ్యన రష్మిని ఈ టీవీని వదిలి సుధీర్ బయటికి వెళ్ళిపోయాడు. దానిపై కూడా కమెడియన్స్ సెటైర్స్ వేస్తూ పంచ్ లు పేలుస్తున్నారు. అయితే గాలోడు ప్రమోషన్స్ కి సుధీర్ జబర్దస్త్ లోకి రాగా.. నువ్ బాధపడితే నేను బాధపడతానో లేదో తెలియదు కానీ.. నువ్ ఏడిస్తే మాత్రం సచ్చిపోతా అన్నాడు సుధీర్, దానికి సచ్చిపోరా సచ్చిపో అంటూ కామెడీ చేసింది రష్మీ, ఇక రష్మిని గాలోడు మూవీలో హీరోయిన్ గా ఎందుకు పెట్టుకోలేదని సుధీర్ ని అడిగితే..
దానికి ఆయన ముందుగా ఈ కథను రష్మీ గౌతమ్ కే చెప్పారు. ఆమెకి డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా సినిమా చేస్తాం. అంతేకాకుండా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ కి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను.. అంటూ రష్మిపై సుధీర్ క్రేజీ కామెంట్స్ చేసాడు.