Advertisement
Google Ads BL

రష్మిక ఆర్ధిక కష్టాలు


ప్రస్తుతం రష్మిక మందన్న టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. తెలుగులో పూజ హెగ్డే తో పోటీ పడి స్టార్ ఛాన్సెస్ పట్టేసి.. ప్రస్తుతం బాలీవుడ్ లో చక్రం తిప్పడానికి రెడీ అయ్యింది. అటు తమిళంలో విజయ్ వారిసు తో తన సత్తా చాటేందుకు తయారవుతున్న రశ్మికకి సినిమాల్లోకి రాకముందు, స్కూల్ డేస్ లో ఆర్థికంగా తన కుటుంబం ఎంతగా కష్టపడిందో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తన ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉండేవో రష్మిక చెప్పింది.

Advertisement
CJ Advs

తాను చిన్నప్పుడు తన కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడింది. మా నాన్నగారికి ఆదాయం లేక మా కుటుంబం ఇబ్బందులు పడింది. కనీసం ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక రెండు నెలలకోసారి ఇల్లు మారుతూనే ఉండేవాళ్ళం, మా నాన్న నాకు ఓ బొమ్మ కూడా కొనియ్యలేని పేదరికాన్ని అనుభవించినట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. అందుకే తనకి ప్రతి రూపాయి విలువ తెలుసు అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో పుష్ప పార్ట్ 2, అలాగే తమిళ్ లో వారిసు, బాలీవుడ్ లో రెండు మూడు ప్రాజెక్ట్ తో రష్మిక బిజీగా ఉండడమే కాదు, సోషల్ మీడియాలో రష్మిక గ్లామర్ షో చేస్తూ అందరి అటెన్షన్ తన మీదే ఉండేలా చూసుకుంటుంది. 

Rashmika talks about her parents financial problems:

Rashmika Mandanna Says Parents Struggled to Find Home, Pay Rent
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs