Advertisement
Google Ads BL

సీరియస్ కండీషన్ లో జబర్దస్త్ కమెడియన్


జబర్దస్త్ కామెడీ షో ఈటీవీలో మొదలు పెట్టిన కొత్తలో చాలామంది కమెడియన్స్ ఈ షో ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఫెమస్ అయ్యారు. ఈ షో నుండి చాలామంది టాప్ కమెడియన్స్ గా ఎదిగి సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిజీ అయ్యారు. అయితే జబర్దస్త్ లో పంచ్ లకి కేరాఫ్ అడ్రెస్ గా పాపులర్ అయిన ప్రసాద్.. పంచ్ ప్రసాద్ గా టీమ్ లీడర్ గాను చేసాడు. పంచ్ ప్రసాద్ తర్వాత అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ కి దూరమయ్యాడు. జెడ్జ్ నాగబాబు, ఇంకా కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ అతనికి హెల్ప్ చెయ్యగా.. అతనికి తన భార్య కిడ్నీ ఇవ్వగా.. ఎలాగో కోలుకుని మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ పై, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై కామెడీ చేస్తూ నవ్విస్తున్నాడు.

Advertisement
CJ Advs

తన బాధను ప్రేక్షకులతో కూడా పంచుకున్నాడు. తన భార్య తనకి కిడ్నీ దానం చేసింది అని చెప్పి అందరితో కంటతడి పెట్టించాడు. అయితే ప్రసాద్ కొద్ది రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడట. అయినా కామెడీ చెయ్యడానికి స్టేజ్ పైకి వస్తున్నాడు. ఎంతగా అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రసాద్ తన పంచ్ లతో కామెడీ ప్రియులని నవ్విస్తున్నాడు.

తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది అని, అతను నడవలేని స్థితిలో ఉన్నట్లుగా మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన యూట్యూబ్ ఛానల్ లో  పంచ్ ప్రసాద్ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో షేర్ చేసాడు.

తన స్థితి ఎవరికీ తెలియకూడదని, తన ఆరోగ్యంపై ఎవరూ జాలి చూపకూడదనే కారణంతో పంచ్ ప్రసాద్ ఎవరికీ చెప్పకపోయినా.. నూకరాజు ప్రసాద్ ని కలవడానికి వెళ్లి ఆ విషయాన్ని చాటుగా షూట్ చేసి వీడియోని షేర్ చేసినట్లుగా చెప్పాడు. అయితే ఓ రోజు షూటింగ్ నుండి వచ్చిన ప్రసాద్ జ్వరంగా ఉంది, తీవ్రమైన  నడుము నొప్పి అని చెప్పడంతో డాక్టర్స్ ని కలిశామని, ముందు డాక్టర్స్ కి కూడా ఇలా ఎందుకయ్యిందో అర్ధం కాలేదు అన్నారు, కానీ తర్వాత టెస్ట్ లు చేసి నడుమ వెనుక నుండి కుడి కాలు చివరి వరకు సీము పట్టింది అని డాక్టర్స్ చెప్పినట్లుగా పంచ్ ప్రసాద్ వైఫ్ చెప్పింది. అందుకే అతను నడవలేని కండీషన్ లో ఉన్నట్లుగా చెప్పడంతో కామెడీ ప్రేక్షకులు ప్రసాద్ పరిస్థితిపై జాలి పడుతూ సానుభూతి తెలుపుతున్నారు.

Jabardasth Comedian Punch Prasad Health Condition:

Jabardasth Comedian Punch Prasad Health Condition is Serious
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs