Advertisement
Google Ads BL

కుమార్తె ఎంట్రీపై.. రోజా రియాక్షన్ ఇదే!


నటి, రాజకీయ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ అయినటువంటి రోజా.. తను ఉన్న ప్రతి రంగంలోనూ తన ప్రతిభను కనబరుస్తూ ముందుకెళుతోంది. మొన్నటి వరకు ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించి.. ఆ షో, టాప్ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఈ మధ్య పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ‘జబర్దస్త్’కి గుడ్‌బై చెప్పేసింది. అయితేనేం.. తన అవసరం ఉందీ అనే ప్రతిసారి రోజా ఈ షోలలో కనిపిస్తూనే ఉంది. విషయంలోకి వస్తే.. ఈ మధ్య రోజా.. తన కుమార్తె అన్షు మాలికను హీరోయిన్‌గా పరిచయం చేయబోతుందంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. రోజా సైడ్ నుంచి క్లారిటీ లేదు కానీ.. అన్షుపై మాత్రం వార్తలు వైరల్ అయ్యాయి. ఆ హీరోతో అన్షు అరంగేట్రం అంటూ వార్తలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే రోజా మాత్రం ఇంత వరకు ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓ ఈవెంట్‌లో.. తన కుమార్తె సినీ ఎంట్రీకి సంబంధించి వస్తున్న వార్తలపై రోజా స్పందించింది.  

Advertisement
CJ Advs

 

‘‘నా పిల్లలు నటులుగా మారతానంటే ముందుగా సంతోషించేది నేనే. నేను హీరోయిన్‌గా చేసే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. వారు నిజంగా నటనవైపు వస్తానంటే మాత్రం ఒక తల్లిగా, ఒకప్పటి హీరోయిన్‌గా వారికి అండగా ఉంటాను. ఎందుకంటే, నా దృష్టిలో నటించడం అనేది గొప్ప వరం వంటిది. ఏ మాత్రం, ఎంత మాత్రం తప్పుకాదు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. కాకపోతే.. నా కుమార్తెకు సైంటిస్ట్ అవ్వాలనే గోల్ ఉంది. దాని కోసం ఎంతో కష్టపడుతుంది. నాకు తెలిసి.. నా కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. తనకి ఆ ఆలోచన కూడా లేదు’’ అని.. తన కుమార్తె సినీ ఎంట్రీపై వస్తున్న వార్తలని రోజా ఖండించింది.

Roja Reaction on Her Daughter Anshu Cine Entry :

Roja Clarity on Anshu Cine Entry Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs