Advertisement
Google Ads BL

బ్రేకింగ్: ఈడీ ఆఫీస్ లో పూరి మరియు ఛార్మి


గతంలో పూరి జగన్నాథ్, అలాగే హీరోయిన్ ఛార్మీలు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజయ్యేవారు. ఆ కేసు నుండి ఎలాగో బయటపడిపోయారు. కానీ ఇప్పుడు లైగర్ విషయంలో పూరి జగన్నాథ్-ఛార్మీలు మరోసారి ఈడీ ఆఫీస్ మెట్లు ఎక్కారు. అసలే లైగర్ డిసాస్టర్ తో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కి లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ పెడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టుగా నేడు లైగర్ నిర్మాతల హోదాలో పూరి జగన్నాథ్-ఛార్మీలని ఈడీ అధికారులు విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

పూరి జగన్నాథ్-ఛార్మిలకి లైగర్ పెట్టుబడుల విషయంలో ఈడీ అధికారులు 15 రోజుల క్రితమే నోటీసు లు ఇచ్చి ఈరోజు నవంబర్ 17 న విచారణకు రమ్మని చెప్పినా.. పూరీ వాళ్ళు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. దానితో పూరి, ఛార్మి ఇద్దరూ ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీస్ కి సైలెంట్ వెళ్లగా ఉదయం నుండి పూరి ని ఛార్మి ని కలిపి, విడివిడిగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. లైగర్ సినిమాని నిర్మించడానికి పెట్టుబడులు ఎలా వచ్చాయో అన్న కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. లైగర్ కి పెట్టుబడులు విదేశాల నుండి రావడంపై ఈడీ పూరీని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

అంతేకాకుండా లైగర్ మూవీ కి కొంతమంది రాజకీయనేతలు పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ ఆరోపణల నేపథ్యంలో పూరి-ఛార్మీలు ఈ విచారణకు సీక్రెట్ గా వచ్చినా ఆ విషయం మీడియాకి తెలిసిపోయింది.పూరి-ఛార్మి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు విదేశాలనుండి వచ్చినట్టుగా గుర్తించిన ఈడీ అధికారులు. అది ఏ రూపేణా వచ్చింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా వీరికి ఏమైనా డబ్బు వచ్చిందా అనే కోణంలో విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. రాత్రయినా ఇప్పటికీ.. పూరి మరియు ఛార్మీలు ఇంకా ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారని తెలుస్తుంది.

Puri Jagannadh-Charmi in ED office:

Puri Jagannadh-Charmi in ED office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs