Advertisement
Google Ads BL

ఇంతకీ నాగ్ ఎక్కడికెళ్లినట్టు..


ఇప్పడు టాలీవుడ్ లో ఓ చర్చ జరుగుతుంది. అది సూపర్ స్టార్ కృష్ణగారు చనిపోతే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఆయనికి నివాళులర్పించడానికి వచ్చారు.. కానీ అక్కినేని నాగార్జున రాకపోవడంపై అందరిలో ఏదో తెలియని అనుమానాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, విజయ్, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇంకా చిన్న హీరోలంతా మహేష్ బాబుని పరామర్శించి వెళ్లారు. అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్, నాగ చైతన్య వచ్చి పెద్దాయనకి నివాళు అర్పించారు. కానీ నాగార్జున రాకపోవడం ఏమిటో ఎవరికి అర్ధం కావడం లేదు. పోనీ ఏదైనా షూటింగ్ లో విదేశాల్లో ఉన్నారా అంటే.. ప్రస్తుతం నాగార్జున ఎలాంటి సినిమాలకి కమిట్ అవ్వలేదు.

Advertisement
CJ Advs

ఇండస్ట్రీ మొత్తం కృష్ణగారి నివాసం దగ్గర ఉంటే.. నాగార్జున రాకపోవడం బొత్తిగా అంతుపట్టడం లేదు. మరి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. పోనీ ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నారా.. అదీ క్లారిటీ లేదు. కృష్ణగారు మరణం తర్వాత నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు కానీ.. ఈయన కడసారి చూపు కోసం రాకపోవడం, కనీసం అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం, మహేష్ ని పలకరించకపోవడం పట్ల అక్కినేని ఫాన్స్ కూడా షాక్ లోనే ఉన్నారు.

నాగార్జున కృష్ణ గారితో వారసుడు సినిమా కూడా చేసారు. అంత అనుబంధం ఉన్న నాగ్ ఆయనకి నివాళు అర్పించకపోవడం పట్ల చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అసలు నాగ్ ఎక్కడికెళ్లినట్టు అంటూ ఆలోచనలో పడుతున్నారు వాళ్ళు.

Why Did Nagarjuna Miss Superstar Krishna Funeral?:

Nagarjuna Absence Becomes a Discussion!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs