Advertisement
Google Ads BL

నరేశ్‌- పవిత్ర ఏం చెప్పాలనుకుంటున్నారు?


ఒక వైపు సూపర్ స్టార్ కృష్ణగారి పార్థివ దేహం చూడడానికి వచ్చిన వారంతా.. శోక సంద్రంలో మునిగిపోతుంటే, ఆ ప్రదేశంలో నరేష్, పవిత్రా లోకేష్‌ల తీరు అందరినీ ఇబ్బందికి గురి చేసిందనేది కాదనలేని వాస్తవం. అసలు వారిద్దరూ ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా.. ఎవరికీ అర్థం కాలేదు. ఏదైనా చెప్పాలని అనుకున్నా.. అది సందర్భమో, కాదో చూసుకోవాలి కదా. వారిద్దరి హడావుడి చూస్తుంటే.. నేను కూడా కృష్ణ ఫ్యామిలీ మెంబర్‌నే అని పవిత్ర, ఈ ఫ్యామిలీలోకి పవిత్రను కూడా తీసుకు వచ్చేశానని, మేమిద్దరం కలిసే ఉంటున్నామని నరేష్.. చెప్పడానికి ప్రయత్నించినట్లుగా అనిపించింది. ఎందుకంటే, కృష్ణగారి పార్థివ దేహం చూడడానికి వచ్చిన ప్రముఖులకి పవిత్రని పరిచయం చేయాలని నరేష్ ఎంతగా ప్రయత్నిస్తున్నాడో ఆ వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

 

ఇద్దరూ ఒకే కారులో నుంచి దిగడం, సెక్యూరిటీ, ఇద్దరు కలిసి కృష్ణగారి పార్థివ దేహానికి పూల దండ వేయడం.. ఇలా ప్రతీది.. వారి గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక నరేష్ చేసిన హడావుడి అయితే అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు వచ్చిన సందర్భంలో నరేష్ బిహేవియర్.. చూస్తున్న వారికి కాస్త అతిగా అనిపించింది. అలాగే కృష్ణగారి పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయాకి తరలించే క్రమంలో.. మహేష్-నరేష్‌లకు మధ్య చిన్న ఇష్యూ కూడా జరిగినట్లుగా టాక్ నడుస్తోంది. గచ్చిబౌలి స్టేడియానికి అని నరేష్, కాదు పద్మాలయా స్టూడియోకి అని మహేష్.. ఇలా వారిద్దరి మధ్య ఇష్యూ జరిగినట్లుగా సమాచారం. అందుకే గచ్చిబౌలి స్టేడియం అని ముందు వార్త బయటికి వచ్చినా.. తర్వాత పద్మాలయాకే మార్చారు. ఈ విషయంలో అసలేం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం.. నరేష్, పవిత్రల వ్యవహారం అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందన్నది మాత్రం వాస్తవం.

Pavitri Lokesh and Naresh at Krishna final Rights:

Pavitri Lokesh and Naresh Relationship is Annoying
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs