Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: ఈసారి వాళ్ళకి కష్టమే


బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వీక్ కంటెస్టెంట్స్ ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారు. ముఖ్యంగా సూర్య-గీతూ ల మాదిరి మరీనా కానీ, రాజ్ కానీ, ఇంకా శ్రీ సత్య కానీ టాస్క్ పెరఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు బిగ్ బాస్ లోనే ఉండి టాప్ 10 లో చోటు కొట్టేసారు. కానీ సూర్య-గీతూ లాంటివాళ్లు బయటికి వెళ్లిపోయారు. నేనింతే అన్నందుకు గీతూ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు. సూర్య ఇనాయతో పెట్టుకున్న ట్రాక్ వర్కౌట్ అవ్వక గేమ్ ఎలా ఉన్నా అతన్ని ఎలిమినేట్ చేసేందుకు ఓట్లు వెయ్యలేదు. అదలా ఉంటే.. ఈవారం మాత్రం మరీనా కానీ, శ్రీ సత్య కానీ ఎలిమినేట్ అవ్వడం పక్కాగానే కనబడుతుంది. రాజ్ ఎలిమినేట్ అవుతాడనుకుంటే.. అతను లక్కీగా ఈవారం బిగ్ బాస్ ఇచ్చిన టెస్ట్ లో పాసై ఇమ్యూనిటీ పొంది ఎలిమినేషన్  నుండి సేవ్ అయ్యాడు..

Advertisement
CJ Advs

ఇక ఓటింగ్ లో గత రెండు వారాలుగా టాప్ పొజిషన్ కోసం రేవంత్, ఇనాయాలు పోటీ పడుతున్నారు. సూర్య వెళ్ళగానే ఇనాయ గ్రాఫ్ పెరగడమే కాదు, ఆమెకి సింపతీ వర్కౌట్ అయ్యి ఓట్లు గుద్దేస్తున్నారు. ఎప్పటిలాగే శ్రీహన్ మూడో స్థానంలో ఉండగా, కీర్తి 4th ప్లేస్ లోను, ఆది రెడ్డి 5th ప్లేస్ లో కొనసాగుతుండగా.. ఆరో స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక చివరి రెండు స్థానాలు, డేంజర్ ప్లేస్ లో శ్రీసత్య, మరీనాలు ఉన్నారని తెలుస్తుంది. సోమవారం ఓటింగ్ లో శ్రీ సత్యకి లీస్ట్ ఓట్స్ పడినాయని, ఖచ్చితంగా ఈ వారం శ్రీ సత్య కాని, మరీనా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

Bigg Boss 6: Danger bells in Sri Satya and Mareena:

Bigg Boss 6: 11th weekvoting update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs