Advertisement
Google Ads BL

ఆహా వారికి గెస్ట్ ల కరువు


ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 1 తో రికార్డులు క్రియేట్ చేసిన ఆహా ఓటిటి.. ఇప్పుడు సీజన్ 2 ని గ్రాండ్ గా మొదలు పెట్టింది. మొదటి సీజన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, మోహన్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ ఇలా క్రేజీ గెస్ట్ లని తీసుకొచ్చిన టీమ్ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో ని ఇరగదీసారు.. సీజన్ వన్  ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. దానితో సీజన్ 2 పై ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. కానీ సీజన్ 2 ని ఆహా వారు సక్రమంగా నడపలేకపోతున్నారు. కారణం గెస్ట్ లు లేకపోవడమే అని తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

బాలకృష్ణ షో కి పిలిస్తే ఎవరు మాత్రం రారు. ఇప్పటికే చాలామంది ఈ షోకి వచ్చేసారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళు ఇంకా రాలేదు. వస్తారన్న నమ్మకం లేదు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, ఎన్టీఆర్ తో బాలయ్య షో చేస్తారో లేదో తెలియదు, చిరు బాలయ్య అన్ స్టాపబుల్ కి వస్తారని అన్నప్పటికీ.. ఇప్పుడు అది డైలమాలో పడింది అనే టాక్ మొదలయ్యింది. అందుకే సినీ సెలబ్రిటీస్ లేకపోవడంతో.. ఇటు పొలిటికల్ లీడర్స్ మీద ఆధారపడుతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ షో పొలిటికల్ షో గా టర్న్ అయ్యింది అంటున్నారు. అందులో భాగంగానే ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని నారా చంద్రబాబు నాయుతో కానిచ్చేసిన ఆహా వారు నాలుగో ఎపిసోడ్ కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకువచ్చారు. 

మరి సినీ సెలబ్రిటీస్ అయితే వారి పర్సనల్ విషయాలతో ఆసక్తి ని క్రియేట్ చెయ్యొచ్చు. కానీ పొలిటికల్ లీడర్స్ విషయంలో అంత ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండదు. సినీ సెలబ్రిటీస్ లేకపోవడంతోనే.. ఈ సీజన్ 2 ని పొలిటికల్ సెలబ్రిటీస్ తో అరవింద్ గారు నింపేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సరే అవయినా సక్రమంగా వస్తున్నాయా అంటే.. మధ్యలో గ్యాప్ గ్యాప్ లు కనిపిస్తున్నాయి.

No New Episode of Unstoppable With NBK:

Balakrishna Unstoppable Season 2 turns into a political show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs