Advertisement
Google Ads BL

లెజెండ్స్ స్టయిల్లో మహేష్-చైతు-తారక్


ఒకప్పుడు టాప్ హీరోలుగా టాలీవుడ్ ని ఏలిన ప్రముఖులు ఒక్కొక్కరిగా నింగికి ఎగిరిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్స్ శకం ముగిసినట్టుగా కనిపిస్తుంది. నందమూరి తారకరామారావు గారు 90 ల్లోనే గుండెపోటుతో మరణించగా.. అక్కినేని 2013 లో మరణించారు, ఇక గత నెలలో కృష్ణంరాజు గారు కాలం చెయ్యగా.. ఈ నెలలో కృష్ణ గారు మృతి చెందారు. ఇలా సీనియర్ హీరోలు ఒక్క్కొకరిగా అందరూ వెళ్లిపోయారు. అప్పట్లో ఎన్టీఆర్-అక్కినేని, కృష్ణ మధ్యన చిన్న చిన్న అభిప్రాయం భేదాలున్నా స్నేహితులుగా మెలిగేవారు. ఒకరి సినిమా ఫంక్షన్ కి మరొకరు హాజరై అభిమానులను సంతోషపెట్టేవారు. అవార్డు ఫంక్షన్స్ లో ముగ్గురు కలిసి కనిపించేవారు. ఆలా ఓ ఈవెంట్ కి హాజరైన కృష్ణ-ఏఎన్నార్-ఎన్టీఆర్ కలిసి ఉన్న అరుదైన ఫోటోని ఈ రోజు కృష్ణగారి మరణం తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసారు అభిమానులు.

Advertisement
CJ Advs

అదలా వైరల్ అవుతున్న టైమ్ లోనే మంగళవారం కృష్ణ గారు మృతి చెందడంతో ఆయనకి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయనాయకులు, తెలంగాణ సీఎం కెసిఆర్ అందరూ వచ్చారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి మహేష్ కి ధైర్యం చెప్పి మహేష్ పక్కనే కూర్చున్న టైమ్ లో.. అక్కినేని నాగ చైతన్య వచ్చాడు. కృష్ణ గారికి నివాళులర్పించి, మహేష్ కి, తారక్ కి మధ్యన కూర్చున్న సమయంలో ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించారు.

మహేష్-నాగ చైతన్య-ఎన్టీఆర్ పక్క పక్కనే ఉన్నారు. అప్పట్లో కృష్ణ-నాగేశ్వరావు-రామారావుగారి ఫోటో లో ఏ ఆర్డర్ లో ఉన్నారో.. ఇప్పుడు కృష్ణ కొడుకు మహేష్-అక్కినేని మనవడు చైతు-ఎన్టీఆర్ మనవడు తారక్ ఆ పిక్ లో ఒకే ఆర్డర్ లో కూర్చున్నారు. ఆ పిక్స్ ని ఒకదాని కింద ఒకటి పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కృష్ణ-ANR-ఎన్టీఆర్ అభిమానులు.

Krishna-ANR-NTR pic goes viral:

Krishna-ANR-NTR: Mahesh-Naga Chaitanya-Tarak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs