సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు మంగళవారం ఉదయం తెల్లవారు ఝామున 4.09 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. నిన్న సోమవారం ఉదయం రెండు గంటల ప్రాంతంలో కార్డియా అరెస్ట్ తో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన కృష్ణ గారు.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అలాగే బ్రెయిన్ ఫెయిల్యూర్ తో మల్టి ఆర్గాన్స్ సిస్టమ్ దెబ్బతినడంతో ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని కుటుంబం మూగబోయింది. టాలీవుడ్ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. కృష్ణ గారు ఆత్మకి శాంతి కలగాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కోరుకోవడమే కాకుండా, పర్సనల్ గా మహేష్ ఫ్యామిలీని కలవడానికి కదులుతున్నారు. ఇక కృష్ణ గారి అభిమానులు ఆయన కడసారి చూపు కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ పయనమయ్యారు.
కృష్ణ గారి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుండి నానక్ రామ్ గూడలోని కృష్ణగారి విజయ-కృష్ణ నివాసానికి తరలిస్తున్నారు. అక్కడినుండి ఈ రోజు సాయంత్రం ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. రేపు బుధవారం కూడా అభిమానుల సందర్శనార్ధం కృష్ణ గారి భౌతిక కాయం అక్కడే ఉంచబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నట్లుగా తెలుస్తుంది.