Advertisement
Google Ads BL

మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి


సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరనే మాట.. మాటలకు అందని విషాదమని అన్నారు చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా అనేక సాహసాలు చేసిన కృష్ణకు చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా అశ్రు నివాళి అర్పించారు.

Advertisement
CJ Advs

‘‘సూపర్ స్టార్ కృష్ణగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణగారు. అటువంటి మహామనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీపరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణగారికి అశ్రు నివాళి. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను’’

-చిరంజీవి

Chiranjeevi pays tribute to Super Star Krishna:

Tollywood Super Star Krishna Is No More
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs