Advertisement
Google Ads BL

సినిమాలకి బ్రేక్ ఇచ్చేసిన స్టార్ హీరో


టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కొద్ది రోజులు సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుండగా.. మరో సీనియర్ హీరో నాగార్జున ఓ ఆరు నెలలు ఎలాంటి కథలు వినను, అలాగే సినిమాలు చెయ్యకుండా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నట్టుగా చెప్పి షాకిచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు.. కొద్ది రోజులు సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లుగా చెప్పి అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆయనెవరో కాదు.. లాల్ సింగ్ చద్దాతో హీరోగానూ, నిర్మాతగానూ ఫెయిల్ అయిన అమీర్ ఖాన్.

Advertisement
CJ Advs

లాల్ సింగ్ చద్దా డిసాస్టర్ అవడంతో ఆయన తన రెన్యుమరేషన్ త్యాగం చేసి డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలూ పూడ్చినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఆ సినిమా రిజల్ట్ తర్వాత ఆమీర్ ఖాన్ పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించింది లేదు. తాజాగా ఆయన తన స్నేహితుడు నిర్వహించిన ప్రోగ్రాం కి హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ఆయన కొద్ది రోజులు తాత్కాలికంగా సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతున్న విషయం చెప్పి షాకిచ్చారు. ఒక నటుడిగా సినిమా చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకేం జరగదు, ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ వస్తుంది.

అసలైతే లాల్ సింగ్ చద్దా తర్వాత ఛాంపియన్స్ మూవీ చెయ్యాలి. అది నిజంగా ఓ అద్భుతమైన కథ. కానీ ఇప్పుడు ఆ సినిమా చెయ్యలేను. కారణం నాకు ప్రస్తుతం విశ్రాంతి కావాలి. నా తల్లి, నా పిల్లలతో టైం స్పెండ్ చెయ్యాలని ఉంది. 35 ఏళ్లుగా ఎప్పుడూ పని గురించే ఆలోచించాను, సినిమాలు చేస్తూనే ఉన్నాను, కానీ అది కరెక్ట్ కాదు. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించాలి అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడిన అమీర్ ఖాన్.. ఈ సమయంలో తనలోని మరో కోణాన్ని చూడవచ్చని చెబుతున్నారు. అయితే ఓ ఏడాదిన్నర పాటు కెమెరాకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టుగా ఆ ఈవెంట్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

A star hero to take a break from movies:

Aamir Khan steps down from Champions as an actor, will co-produce the film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs