Advertisement
Google Ads BL

‘దేవర’.. సౌండింగ్ లైక్ ‘కాంతార’!


 

Advertisement
CJ Advs

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా.. కాదు నెలలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలీ సినిమా ఉంటుందా? అనేలా కొన్ని సార్లు, డైరెక్టర్ మారాడు అంటూ మరికొన్ని సార్లు.. ఇలా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాపై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నా.. మేకర్స్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక చేసేది లేక.. నిర్మాణ సంస్థ పేరుతో ఫ్యాన్సే కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. అప్‌డేట్స్ అంటూ ఈ సినిమాని వార్తలలో ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అభిమానుల బాధని, ప్రయత్నాన్ని చూసిన మేకర్స్.. త్వరలోనే సినిమా మొదలవబోతోంది అంటూ కొరటాలతో రత్నవేలు, సాబూ సిరిల్ ఉన్న పిక్స్‌ని విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా టైటిల్‌పై సరికొత్తగా వార్తలు మొదలయ్యాయి. 

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని దేవుడిగా భావించే బండ్ల గణేష్.. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. ‘దేవర’ అంటూ సంబోధిస్తుంటాడు. ఇప్పుడా ‘దేవర’ టైటిల్‌నే ‘NTR30’కి ఫైనల్ చేసినట్లుగా టాక్ మొదలైంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నప్పటికీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పవర్ ఫుల్ టైటిల్ అంటూ సోషల్ మీడియా వేదికగా.. ఆ టైటిల్‌ని ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరైతే.. ‘దేవర’ సౌండింగ్ వినడానికి ఇటీవల వచ్చిన ‘కాంతార’ను తలపిస్తుందనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం. వాస్తవానికి ‘కాంతార’ చిత్ర హీరోకి కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు ఆ ‘కాంతార’ను పోలిన టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా అంటే.. ఫ్యాన్స్‌ని ఆపలేరు కూడా. అయితే ఈ టైటిల్‌పై మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూద్దాం.. ఫైనల్‌గా ‘NTR30’కి ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో?

Devara sounding Like Kantara:

Devara.. Is this NTR 30th Film Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs