Advertisement
Google Ads BL

అల్లు ఆర్మీ మరీ వైల్డ్ గురూ..


అల్లు అర్జున్ కొద్ది రోజులుగా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటూనే.. మెగా టాగ్ నుండి అల్లు సైన్యం, అల్లు ఆర్మీ అంటూ అభిమానులని తిప్పేసాడు. వారితో అల్లు అర్జున్ ఎక్కడికెళ్లినా.. అల్లు అర్జున్ అనే నినాదాలు కొట్టించుకుంటున్నాడు. ఇకపోతే హీరోల ఫాన్స్ తమ హీరోల సినిమా అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో చేసే యుద్ధం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ అల్లు అర్జున్ ఫాన్స్ మరీ వైల్డ్ గా తయారయ్యారు. ఎందుకంటే పుష్ప ద రూల్ అప్ డేట్ కోసం వాళ్ళు హైదరాబాద్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న పుష్ప పార్ట్ 2 షూట్ రీసెంట్ గానే మొదలయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సౌత్ ఆఫ్రికాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసున్నాడు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ లేకుండానే పుష్ప షూటింగ్ మొదలు పెట్టారు. అయితే అల్లు ఫాన్స్ పుష్ప అప్ డేట్ కావాలంటూ గీత ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తూ ఓవరేక్షన్ కి దిగారు. అయితే మిగతా హీరోల ఫాన్స్ ఒకలా ఉంటే.. అల్లు ఆర్మీ మాత్రం వైల్డ్ గా ఉంది గురూ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వారి ఆందోళనకి కారణం.. పుష్ప పార్ట్ 1 విడుదలై ఏడాది గడిచిపోతుంది.. పార్ట్ 2 షూటింగ్ కోసం ఇంకా ఇంకా ఆలోచించడం ఎవరికి నచ్చడం లేదు. కనీసం పుష్ప ద రూల్ సెట్స్ మీదకి వెళ్ళినట్టుగా అధికారికంగా అప్ డేట్ ఇచ్చినా వాళ్ళు కూల్ అయ్యేవారు. కానీ సైలెంట్ గా పుష్ప ని సెట్స్ మీదకి తీసుకెళ్లడంతో కాలిన అభిమానులు పుష్ప అప్ డేట్ కోసం ధర్నాకి  దిగారన్నమాట. 

Allu fans dharna at Geetha Arts office:

Allu Arjun fans Over-action at Geetha arts office for Pushpa 2 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs