బిగ్ బాస్ సీజన్ 6 నుండి పదో వారం డబుల్ ఎలిమినేషన్ లో బయటికి వచ్చిన వాసంతి కృష్ణన్ అసలైతే మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ ఆమె గ్లామర్ నిజంగా ఆమెని కాపాడింది. అప్పట్లోనే ఆరోహి, నేహా లాంటి ప్లేయర్స్ వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. వాసంతి అస్సలు గేమ్ ఆడదు. కాని ఆమె గ్లామర్ గా హౌస్ లో కలియతిరగడం బిగ్ బాస్ కి కాస్త క్రేజ్ రావడానికి కారణమయ్యింది. దానితో బిగ్ బాస్ కొద్ది వారాలు కాపాడినప్పటికీ.. తర్వాత ఆమె టాస్క్ పెరఫార్మెన్స్ లో ఇరగదీసింది. మళ్ళీ గత వారం కాస్త వీక్ గా కనిపించింది. వాసంతి హౌస్ లోనే ఉండి.. చంటి, సూర్య, గీతూ లాంటి వాళ్ళు ఎలిమినేట్ అవడం ఎవరికీ నచ్ఛలేదు. ఫైనల్ గా పదో వారంలో బాలాదిత్య శనివారం ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం వాసంతి ని బయటికి పంపేశారు.
అయితే బయటికి వచ్చిన వాసంతి కామ్ గా కారెక్కి వెళ్లకుండా.. పవన్ ఫాన్స్ కి థాంక్స్ చెబుతూ, పవర్ స్టార్ నినాదాలు చేసింది. తర్వాత ఆమె యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వూస్ లో నానా హడావిడి చేస్తుంది. ఆమె ఇంటర్వూస్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి థాంక్స్ చెప్పడం, అలాగే జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తుంది. ఆమెకి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఓట్లేసి ఇంతవరకు ఆమెని ఎలిమినేట్ అవ్వకుండా కాపాడారంటూ ఎవరో చెప్పారట. దానితో ఆమె పవన్ ఫాన్స్ కి థాంక్స్ చెబుతూ.. జై పవర్ స్టార్ అంటూ హంగామా చేసింది.