మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆచార్య’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎటువంటి రిజల్ట్‌ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. ‘ఆచార్య’ విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు ఉన్నాయో, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేశారో.. అంతకు రెండింతలు వారిని ఈ చిత్రం నిరాశ పరిచింది. ఎప్పుడూ లేనిది చిరు, చరణ్‌లపై ట్రోలింగ్‌కి కూడా ఈ చిత్రం కారణమైంది. సినిమా విడుదల తర్వాత వచ్చిన రిజల్ట్‌పై పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి కూడా పబ్లిక్‌గా రియాక్ట్ అవుతూ.. కొరటాలకే కాకుండా.. ఇతర డైరెక్టర్స్‌కి కూడా క్లాస్ ఇచ్చారు. ఆ సినిమా ఫెయిల్యూర్‌కి టోటల్ కారణం.. కొరటాల శివే అనేలా తన అసహనాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే.. ఆ సినిమా విడుదల తర్వాత పరిణామాలు చిరుతో అలా మాట్లాడించాయి. అయితే, ‘ఆచార్య’ ఫ్లాప్‌పై రెండు, మూడు సందర్భాలలో చిరంజీవి మాట్లాడటమే కానీ, రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఆ సినిమా ప్రస్తావన తీసుకురాలేదు. తాజాగా ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఈ సినిమా ప్రస్తావనను తీసుకువచ్చారు.
‘ఆచార్య’ సినిమాకు రామ్ చరణ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. సినిమా రిజల్ట్ తర్వాత చిరు, చరణ్‌లు వారి రెమ్యూనరేషన్స్ 75 శాతం వెనక్కి ఇచ్చేసినట్లుగా.. మెగా కాంపౌండ్ నుంచి వార్తలు కూడా వచ్చాయి. అయినా సరే.. ఇప్పటి వరకు రామ్ చరణ్ మాత్రం ఎక్కడా ఆ సినిమా రిజల్ట్‌పై మాట్లాడలేదు. సినిమా విడుదలైన ఇన్నాళ్లకి ఫస్ట్ టైమ్ చరణ్ ‘ఆచార్య’ రిజల్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత నేను నటించిన మరో చిత్రం విడుదలైంది. అందులో నేను అతిథి పాత్ర చేశాను. ఆ సినిమాని ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఫలితంగా ఆ సినిమా సరైన రిజల్ట్‌ని పొందలేకపోయింది. కాబట్టి.. ఇక్కడ హీరో ఎవరనేది ఇంపార్టెంట్ కాదు.. కంటెంట్ ముఖ్యం. సరైన కంటెంట్ లేకపోతే.. ఏ హీరో సినిమా అయినా సరే.. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఇష్టపడటం లేదని రామ్ చరణ్ ‘ఆచార్య’ పేరు ప్రస్తావించకుండా.. ఆ సినిమా విషయంలో తనూ డిజప్పాయింట్ అయినట్లుగా చెప్పుకొచ్చారు.