ప్రముఖ క్రీడాకారులు సానియా మీర్జా-షోయబ్ మాలిక్ లు 12 ఏళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పాకిస్తానీ క్రికెటర్ షోయెబ్ మాలిక్-ఇండియా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ల ప్రేమ పెళ్లి అప్పట్లో పెను సంచలనం. అయితే కొద్దిరోజులుగా వీరివైవాహిక జీవితం సజావుగా లేదు అని, షోయెబ్ మాలిక్ పాకిస్తానీ నటి అయేషా తో క్లోజ్ గా ఉంటూ తనని నెగ్లెట్ చేస్తున్న కారణంగా సానియా మీర్జా భర్తతో గొడవపడి విడాకులు కోరుకుంటుంది అంటూ బాలీవుడ్ నుండి టాలీవుడ్ మీడియా వరకు ఒకటే న్యూస్ లు.
కానీ ఇప్పుడు వారి మధ్యన ఎలాంటి విభేదాలు లేవు అనేలా ఓ బిగ్ ట్విస్ట్ రివీల్ అవడం వాళ్ళ అభిమానులని సంతోష పెడుతుంది. అంటే వాళ్ళ మధ్యన విభేదాల విషయం క్లారిటీ లేకపోయినా.. దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చే న్యూస్ ఇప్పుడు హైలెట్ అయ్యింది. సానియా-షోయబ్ కలిసి ఒక రియాలిటీ షో చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ రావడం హాట్ టాపిక్ గా మారింది. వీళ్లిద్దరూ కలిసి పాకిస్తానీ టివి కోసం మీర్జామాలిక్ షో చేయడానికి రెడీ అయ్యారు.. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతోంది. సానియా-షోయెబ్ చెయ్యబోయే ఈ మీర్జామాలిక్ షో కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఉంటుందట.
ప్రముఖ ఇంటర్నేషనల్ క్రీడాకారులను ఈ షోలోకి పిలిచి వారి మనోగతాన్ని జీవితంలో సాధించిన విజయాలని షేర్ చేయబోతున్నారట. ఈ టాక్ షో కోసం సానియా-షోయబ్ ఇద్దరూ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. సో విడాకుల విషయం అధికారికం అన్న తరుణంలో ఓ షో తో అందరి ముందుకు రావడం నిజంగా ఆశ్చర్యమే.