గత కొన్నేళ్లుగా అనసూయ జబర్దస్త్ అంటూ ఆ స్టేజ్ మీద గ్లామర్ గా హొయలు పోవడమే కాదు, సోషల్ మీడియాలో గురువారం గురువారం తన గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యూత్ ని ఆకర్షించేది. యాంకరింగ్ కి గ్లామర్ ని మిక్స్ చేసిన ఘనత అనసూయకు దక్కుతుంది. వచ్చామా.. మాట్లాడమా అని కాకూండా అందంగా కనిపిస్తూ.. అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తే దానికి మరింత అందం వస్తుంది అంటూ అనసూయ బిహేవియర్ ఉండేది. ఇక జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోవడంతో గురువారం ఆమె ఫోటో షూట్ ని అందరూ మిస్ అవుతున్నారు.
అదే టైమ్ లో మరో యాంకర్ శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచింది. ఒకప్పుడు కాస్త లావుగా వున్న శ్రీముఖి ఇప్పుడు భారీగా వెయిట్ లాస్ అయ్యి మరింత గ్లామర్ గా మెరిసిపోతుంది. జీ తెలుగు, స్టార్ మా, ఈటివి స్పెషల్ షోస్ అబ్బో శ్రీముఖి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దానికి కారణం ఆమె అందాల ఆరబోతే.. మొన్నామధ్యన SIIMA అవార్డ్స్ లో టూ మచ్ గ్లామర్ షో చేస్తూ క్లివేజ్ అందాలని చూపించిన శ్రీముఖి అప్పటినుండి అస్సలు తగ్గడం లేదు. వారానికి రెండు మూడు ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని అల్లాడిస్తుంది. ఒకప్పుడు అనసూయ చేసిన పని ఇప్పుడు శ్రీముఖి మొదలు పెట్టింది. అందుకే ఆమెకి చేతినిండా టీవి షోలే.