రామ్ చరణ్-ఎన్టీఆర్ కలయికలో రామ్-భీమ్ గా రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసారు. ఇండియా వైడ్ గా ప్రేక్షకులని ఊపేసిన ట్రిపుల్ ఆర్ రీసెంట్ గా జపాన్ లోను విడుదలై రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇంకా ఇంకా ట్రిపుల్ ఆర్ ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ అభిమానులనే కాదు మూవీ లవర్స్ అందరిని ఇంప్రెస్స్ చేసారు. వారి స్నేహం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో అడుగడుగునా హైలెట్ అయ్యింది. స్టార్ హీరోల అభిమానుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అభిప్రాయాన్ని ఆల్మోస్ట్ రాజమౌళి తుడిచేసినట్టే కనిపించింది.
ఇక పాన్ ఇండియా మూవీగా ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలాంటి సినిమాకి సీక్వెల్ చేస్తామని రాజమౌళి చెప్పడంతో మరోసారి ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తో బలమైన పాన్ ఇండియా స్టార్స్ గా గట్టి పునాదులు వేసిన ఈ ఇద్దరూ మళ్లీ కలిసి కనబడితే మాములుగా ఉండదు.. పూనకాలే.
గతంలోనే అంటే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ అప్పుడే ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్‌కు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నారు. అయితే ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని అప్పట్లో ఆయన చెప్పారు. కానీ రాజమౌళి చికాగోలో జరిగిన మీడియా సమావేశంలో నిజంగానే RRR 2 ఉంటుందని చెప్పడంతో ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. నిజంగా RRR2 అనౌన్స్‌మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారనడంలో సందేహం లేదు.