బిగ్ బాస్ సీజన్ పదో వారం పూర్తి చేసుకుని పదకొండో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తొమ్మిదిమంది లో ఇద్దరు ఎలిమినేట్ అవుతున్న విషయం లీకుల ద్వారా బయటికి వచ్చేసింది. అదలా ఉంటే నాగార్జున వచ్చే శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి నాగార్జున పీకే క్లాస్ విషయంలో భయపడతారు. నాగార్జున కూడా కంటెస్టెంట్స్ ని నిలబెట్టి తప్పు చేసిన వారిపై ఫైర్ అవుతారు. ఇక నేడు శనివారం ఎపిసోడ్ లో రేవంత్ పై హౌస్ లో ఎవరికైనా కంప్లైంట్ ఉన్నాయా అన్నారు. దానికి రోహిత్ నిలబడి.. అతను సంచాలక్ గా కొంతమందికి ఫెవర్ గా ఉన్నాడు అన్నాడు.
నాగార్జున రేవంత్ సంచాలక్ గా ఫెయిల్ అయిన విషయాన్ని, ఆది రెడ్డి కి ఫెవర్ గా ఉండి.. రోహిత్ విషయంలో తప్పు చేసిన విషయాన్ని వేలెత్తి చూపారు. ఇక ఇనయపై నాగార్జున ఫైర్ అయ్యారు. నువ్ గేమ్ లో ఓడిపోతే F.. అనే బూతు వాడతావా.. ఫైమా నామినేషన్స్ విషయంలో ఆమె ప్రొఫెషన్ మీద కామెంట్స్ చేసావ్ అది కరెక్ట్ నా.. అందరితో తగువు పడతావ్ అది నీకు కరెక్ట్ గా అనిపిస్తుందా అంటూ నాగర్జున ఇనయకి క్లాస్ పీకిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.